31.2 C
Hyderabad
February 14, 2025 19: 07 PM
Slider హైదరాబాద్

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024 గ్రాండ్ ఫినాలే

#grandfinale

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (ఎస్ఐహెచ్) 2024 గ్రాండ్ ఫినాలే – సాఫ్ట్‌వేర్ ఎడిషన్ తెలంగాణలోని శంషాబాద్ లో ఉన్న వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రఖ్యాత కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ (ఎంఐసీ)  ఏఐసీటీఈ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువ ఆవిష్కర్తలు తమ సృజనాత్మక పరిష్కారాలను ప్రదర్శించేందుకు ఇది వేదికగా మారింది. ఈ  కార్యక్రమం పాటల సమర్పణ, దీపప్రజ్వలనతో ప్రారంభమైంది.

నోడల్ పీఓసీలు డాక్టర్ జే. కృష్ణ చైతన్య, డాక్టర్ జీ. శ్రీనివాసులు, నోడల్ సెంటర్ హెడ్ డాక్టర్ జే. వి. ఆర్. రవీంద్ర స్వాగతం పలికారు. డాక్టర్ రవీంద్ర మాట్లాడుతూ, ఎస్ఐహెచ్ వంటి కార్యక్రమాలు యువత ఆవిష్కరణలను వినియోగించి సమాజ, పరిశ్రమల సమస్యలను పరిష్కరించడానికి తగిన వేదికలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఎల్టీఐ మైండ్ ట్రీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, నోడల్ సెంటర్ హెడ్ (ఏఐసీటీఈ  & ఎంఐసీ)యోగేష్ టోపాలే మాట్లాడుతూ యువత సృజనాత్మకతకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

సుధీర్ జోసఫ్, ఇంకోయిస్ సైంటిస్ట్ G, హ్యాకథాన్  లక్ష్యాల గురించి వివరించి, ఆవిష్కరణలను ప్రాక్టికల్ అప్లికేషన్లుగా మార్చడంపై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్య అతిథి, ఏఐసీటీఈ అడ్మినిస్ట్రేషన్ బ్యూరో డైరెక్టర్  శ్రీ మనుశ్రీ గుజ్జు మాట్లాడుతూ  ఈ కార్యక్రమం దేశానికి ఉపయోగకరమైన ఆవిష్కరణలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. హ్యాకథాన్ ద్వారా భారత యువత సాంకేతికతలో ప్రగతిని సాధిస్తున్నారని యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ బి. జె. రావు,  ప్రశంసించారు. కేంద్ర స్థాయి ప్రారంభోత్సవంలో, ఏఐసీటీఈ వైస్ చైర్మన్ డాక్టర్ అభయ్ జెరే హ్యాకథాన్ విధివిధానాలను వివరించి, యువతలో సమస్యల పరిష్కార సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని చెప్పారు.

ఏఐసీటీఈ చైర్మన్, ప్రొఫెసర్ టి. జి. సీతారామ్ పాల్గొని, ఎస్ఐహెచ్ ద్వారా దేశం సాంకేతికతలో ముందంజలో ఉందని ప్రశంసించారు. గోద్రెజ్ అప్లయెన్సెస్ అధికారి శాంత్ రంజన్ పరిశ్రమల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. విద్యాశాఖ కార్యదర్శి శ్రి సంజయ్ కుమార్, భారత సాంకేతిక నైపుణ్యాలను మెచ్చుకున్నారు. ఇతర ముఖ్య అతిథులు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  యువత సృజనాత్మకతను ప్రోత్సహించడంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ నోడల్ సెంటర్‌లో ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ అందించిన 6 కీలక సమస్యలపై పరిశీలన జరుగుతోంది. ఈ సమస్యల మూల్యాంకనంలో ఇంకోయిస్  భాగస్వామిగా ఉంది. మురుగు ప్రవాహాల గుర్తింపు, డేటా ఇంటెగ్రిటీ, మెరుగైన సముద్ర పరిజ్ఞానంపై గేమిఫైడ్ లెర్నింగ్ వంటి అంశాలపై పాల్గొనేవారు తమ పరిష్కారాలను అందిస్తారు. ఈ రెండు రోజుల కార్యక్రమం దేశ భవిష్యత్తును మెరుగుపరిచే సాంకేతిక పరిష్కారాలను వెలికితీసేందుకు దోహదం చేస్తుంది.

Related posts

ప్రభుత్వానికి ఎదురుతిరిగిన వైసీపీ సర్పంచ్ లు

mamatha

పివోకే పై చర్యలకు పావులు కదుపుతున్నారా?

Satyam NEWS

రోజా గన్ మెన్ కు కరోనా పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment