37.2 C
Hyderabad
April 19, 2024 11: 53 AM
Slider నిజామాబాద్

గర్భిణుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

#smitasabrwal

గర్భిణుల పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతితో కలిసి ఆమె పర్యటించారు. బిక్కనూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి గర్భిణులకు న్యూట్రీషన్ కిట్లను పంపిణీ చేశారు. గర్భిణులతో మాట్లాడారు.

ఆరోగ్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుంటున్న స్మితా సబర్వాల్

వారి ఆరోగ్య వివరాలు తెలుసుకోవడంతో పాటు న్యూట్రిషన్ కిట్స్ వల్ల ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ.. గర్భిణులు ఆరోగ్యంగా ఉండటం కోసమే ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. న్యూట్రిషన్ కిట్లను వాడటం ద్వారా గర్భిణుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. తాను కూడా ఈ కిట్స్ లో ఉండే పదార్థాలానే వాడినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని, గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పారు.

బీఎస్పీ నాయకుని అరెస్ట్

స్మితా సబర్వాల్ పర్యటనలో బీఎస్పీ నాయకుడు శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పర్యటనలో భాగంగా గర్భిణులతో స్మితా సబర్వాల్ మాట్లాడారు. గర్భిణీలకు అన్ని సేవలు అందుతున్నాయని స్మితా సబర్వాల్ చెప్పడంతో అవేమీ జరగడం లేదంటూ అడ్డుకున్న బీఎస్పీ నాయకులు శ్రీధర్ రెడ్డి ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దాంతో సభలో నుంచి శ్రీధర్ రెడ్డిని పోలీసులు బయటకు తీసుకెళ్లారు. సుమారు 15 నిమిషాల పాటు పోలీసులకు, శ్రీధర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం శ్రీదర్ రెడ్డిని పోలీసులు లాక్కెళ్లారు. నిజాలు మాట్లాడుతుంటే ఎందుకు అరెస్టు చేస్తారంటూ పోలీసులపై శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

పోలియో చుక్కలు వేసిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

నవంబర్ 3 లోపే రైతు బంధు డబ్బులు వెయ్యాలి

Satyam NEWS

రేపు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల నుంచి శ్రీవారి సారె

Satyam NEWS

Leave a Comment