37.2 C
Hyderabad
March 28, 2024 20: 54 PM
Slider విజయనగరం

క‌రోనా భ‌యం..అందుకే అదుంటే ఎంతో అభ‌యం..!…ఏమిట‌ది..?

#VijayanagaramPolice

క‌రోనా సెకండ్ వేవ్ ప‌ట్ల ప్ర‌జ‌ల‌లో విప‌రీతంగా భ‌యం ప్ర‌బలుతోంది. సోష‌ల్ డిస్ట‌న్స్, మాస్క్, శానిటిజైర్(ఎంఎంఎస్) లేనిదో ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని, మాస్క్ లేకుంటే జ‌రీమానా కూడా విధిస్తామ‌ని ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నాయి.

మ‌రోవైపు క‌రోనా సెకండ్ వేవ్ తో కేసులు కూడా శ‌ర వేగంగా పెరుగుతున్నాయి. ఈ క‌రోనా సెకండ్ వేవ్ ప‌ట్ల చ‌నిపోతామ‌న్న భ‌యం లేకున్నా…కరోనా వ‌స్త‌…మున్ముందు శ‌రీరంలో రుగ్మ‌త‌లు పెరిగి…చ‌నిపోయే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డిన‌ట్టేన‌ని వైద్యులు సూచిస్తున్నారు.

దీంతో ప్ర‌తీ ఒక్క‌రి చేతులో స్మార్ట్ ఫోన్ ఎంత అవ‌స‌ర‌మో…ముఖానిని మాస్క్ అంత అవ‌స‌ర‌మ‌ని నొక్కి చెబుతున్నాయి…ప్ర‌స్తుత ప‌రిస్థితులు. తెలుగు రాష్ట్రాల‌లో ఈ క‌రోనా సెకండ్ వేవ్ కేసులు రోజు రోజుకీ అధిక మ‌వుతున్నాయి.

గ‌తేడాది ఈ స‌మ‌యంలోనే క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌ల‌వ్వ‌డం జ‌రిగింది.దేశ వ్యాప్తంగా  శ‌ర వేగంగా ప్ర‌బ‌లి…రోజు వంద‌లాది మందికి  ఆ వైర‌స్ బారిన ప‌డి హాస్ప‌ట‌ల్ పాల‌య్యారు. ద‌రిమిలా కేంద్ర ప్ర‌భుత్వం ఫ‌స్ట్ టైమ్ లాక్ డౌన్ విధించింది.

ఈ మార్చి ఏప్రియ‌ల్ నెల‌లో ఏపీ రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఒక్క కేసు న‌మోదు కాకుండా..క‌డు జాగ్ర‌త్త‌గా కాపాడ‌గ‌లిగారు…జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ.తాజాగా ఈ ఏడాది ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ శ‌రవేగంగా ప్ర‌బలుతోంది. దీంతో రోజురోజుకీ కేసులు సంఖ్య విప‌రీతంగా పెరుగుతున్నాయి.

ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించిన జిల్లా ఎస్పీ…మాస్క్ త‌ప్ప‌న స‌రి అంటూ ఆదేశాలు జారీ చేసారు. తొలుత మాస్క్ పెట్టుకోవాల‌టూ ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. అనంత‌రం…మాస్క్ లేని వాళ్ల‌కు జిల్లా పోలీస్  శాఖ ఆధ్వ‌ర్యంలో ఎస్పీ యే స్వ‌యంగా మాస్క్ లు అంద‌జేసారు. కొద్ది రోజుల త‌ర్వాత మాస్క్ లేకుండా రోడ్డు మీద‌కు వ‌స్తే  జ‌రీమానా తప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

ఆ త‌ర్వాత కూడా ప్ర‌జ‌లెవ్వ‌రూ మాస్క్ లు ద‌రించ‌కుండా జ‌రీమానా విధిస్తామ‌ని చె్ప్పారు.  ఇంకొద్ది రోజులైన త‌ర్వాత మాస్క్ లేకుండా ఎవ్వ‌రైనా రోడ్ల‌పైకి క‌నిపిస్తే..500 నుంచీ 1000 రూపాయ‌ల జ‌రీమానా విధిస్తున్నారు…పోలీసులు.అయితే క‌రోనా తీవ్ర ప్ర‌భావం..ద‌రిమిలా పోలీసులు హెచ్చ‌రిక‌లంతో జిల్లా ప్ర‌జ‌ల‌లో  కాస్త భ‌యం  ప‌ట్టుకుంది.

దీంతో ప్ర‌తీ ఒక్క‌రూ మాస్క్ లు పెట్టుకోవ‌డం కనిపిస్తోంది. చేతిలో సెల్ లేక‌పోయినా ఉండ‌గ‌లుగుతున్నారు కానీ…ముఖానికి మాస్క్ లేకుండా ఎవ్వ‌రూ గుమ్మం దాటి బ‌య‌ట అడుగు పెట్ట‌డం లేదు. మాస్క్ ధ‌రించ‌డంపై ఎస్పీ రాజ‌కుమారీ..మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌లో ఇంకా అవ‌గాహ‌న పెర‌గాల‌ని దానిపైనే త‌మ శాఖ విస్త్ర‌త ప్ర‌చాంర క‌ల్పిస్తోంద‌ని చెప్పారు.

Related posts

కోదండ రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన  ముఖ్య‌మంత్రి

Satyam NEWS

తెదేపా బీసీ నాయకుల పై వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు

Satyam NEWS

వీడిన ఎల్లంగౌడ్ హత్య కేసు మిస్టరీ

Satyam NEWS

Leave a Comment