ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరు జగనన్న లే ఔట్ నుండి కోట్లాది రూపాయల మెటీరియల్ ను చాటు మాటు గా తరలిస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ నుండి డస్ట్ ని తరలిస్తున్న 6 టిప్పర్ లను ఆదివారం రాత్రి పెదవేగి పోలీసులు సీజ్ చేసి స్టేషన్ కి తరలించారు. వంగూరు లో గత వై సి పీ ప్రభుత్వం అధికారం లో ఉండగా సుమారు 150 ఎకరాల భూమిని సేకరించి ఆ భూమి లో ఒక్కొక్క లబ్దిదారునికి 1,1/2 సెంట్లు ఇళ్ల స్థలాలు గా సబ్ డివిజన్ చేసి సుమారు 9 వేల మంది కి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు అందచేశారు.
ఈ భారీ లే ఔట్ లో పెదవేగి మండలం తో బాటు ఏలూరు పరిసర ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ లే ఔట్ లో సుమారు 5 వేల జగనన్న గృహాల నిర్మాణానికి అప్పటి వై సి పీ కి చెందిన ఒక ఎమ్ ఎల్ ఏ కి చెందిన ఒక నిర్మాణ సంస్థ లబ్ధి దారులకు ఇళ్లు నిర్మించి అందించే విధంగా కాంట్రాక్టు కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే ఆ ఎమ్ ఎల్ ఏ వంగూరు లే ఔట్ లో 5 వేల గృహాలు నిర్మించేందుకు గాను సిమెంట్ రాళ్ళు, సిమెంట్ బస్తాలు, ఐరన్, ఇసుక, పునాదుల నిర్మాణం లో ఉపయోగించే సిమెంట్ డస్ట్ ను లే ఔట్ లో స్టాక్ పెట్టినట్టు తెలిసింది.
అయితే ఆ ఎమ్ ఎల్ ఏ కొన్ని గృహాలు పునాది దశలో ను, మరి కొన్ని నిర్మాణ దశలో నిర్మించారని ఆ తరుణం లోనే ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడం తో ఆ గృహాలన్ని ప్రాథమిక నిర్మాణ దశ లోనే ఆగి పోయాయని తెలిసింది. ఈ మెటీరియల్ దగ్గర వాచ్ మెన్ గా పనిచేసే ఒక వ్యక్తి కొంత మంది తో చేతులు కలిపి రాత్రి వేళల్లో ఐరన్, సిమెంట్ రాళ్ళు, డస్ట్, ఇసుక అక్రమ మార్గాన టిప్పర్ ల ద్వారా ట్రాక్టర్ ల ద్వారా తరలించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆ గ్రామం లో ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కొంత మంది ఇక్కడ నుండి తరలించిన కొంత ఐరన్ ను సోమవర్పాడు బై పాస్ దగ్గర ఉన్న ఒక పాత ఐరన్ షాప్ లో విక్రయించి సొమ్ము చేసుకున్నట్టు తెలిసింది. సమాచారం తెలుసుకున్న సంబంధిత అధికారులు ఆ షాప్ పై దాడులు చేసి ఐరన్ ను గుర్తించి ఆ షాప్ యజమానికి లక్షల్లో పెనాల్టీ వేశారని చెప్పుకుంటున్నారు. తాజా గా వoగూరు లే ఔట్ నుండి ఆది వారం రాత్రి డస్ట్ తరలిస్తున్న 6 టిప్పర్ ల పై పెదవేగి పోలీసులు దాడి చేసి సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
టిప్పర్ ల సీజ్ పై పెదవేగి ఎస్ ఐ రామకృష్ణ ను సోమవారం వివరణ కోరగా వంగూరు జగనన్న లే ఔట్ నుండి డస్ట్ ను టిప్పర్ ల పై తరలిస్తున్నారని వచ్చిన సమాచారం పై టిప్పర్ లను సీజ్ చేశామని ఎస్ ఐ రామ కృష్ణ వివరణ ఇచ్చారు. ఈ డ స్ట్ వంగూ రు నుండి ఏలూరు లోని పోణంగి, కోడేలు లో ఉన్న జగనన్న లే ఔట్ లలో నిర్మించే గృహాలకు తరలిస్తున్నారని ఎస్ ఐ తెలిపారు.