పరిశ్రమల వృద్ధి ద్వారా కోనసీమ అభివృద్ధికి దిక్సూచి కాబోయే ‘శుభాకాంక్ష ప్లాట్‌ఫాం’ను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాస్ స్వయంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వేదిక ద్వారా తొలి పరిశ్రమగా Snackeat Food Processing Unit ను మండపేట మండలం చెళ్ళూరు గ్రామంలో యువ పారిశ్రామికవేత్త సాయిరామ్ (రామచంద్రపురం) చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పరిశ్రమను పరిశీలించి అభినందనలు తెలుపుతూ మాట్లాడారు. తెలివితేటలతో, దృఢమైన సంకల్పంతో పరిశ్రమలు ప్రారంభించాలనుకునే యువతకు MSME పథకాలతో పాటు, శుభాకాంక్ష వేదిక ద్వారా ప్రభుత్వ సహకారం అన్ని విధాల అందుతుందన్నారు.
Snackeat యూనిట్ ఈ మార్గంలో మొదటి మైలురాయి అని తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి GitArtha Tax Consulting LLP (రామచంద్రపురం) పూర్తి ప్రాజెక్ట్ సిద్ధత, లీగల్, ఆర్థిక సపోర్ట్ అందించింది. GitArtha వ్యవస్థాపకుడు మణికంఠ KL మాట్లాడుతూ ఇంకా పరిశ్రమలు ప్రారంభించాలనుకునే యువత – మీ ఆలోచనలను స్కానర్‌లో పెడితే చాలు, మేము శుభాకాంక్ష వేదిక ద్వారా పూర్తి సపోర్ట్‌తో మీ కలను నిజం చేస్తామన్నారు.Snackeat యూనిట్‌కు మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు ఫోన్ ద్వారా తమ ఆశీస్సులు తెలియజేశారు.
పరిశ్రమల స్థాపన ద్వారా మండపేట నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని, ఇంకా అనేకమంది ముందుకు రావాలని ఆకాంక్షించారు.Snackeat బ్రాండ్‌ను ప్రభుత్వం స్థాయిలో ప్రచారం చేయడంలో భాగస్వామిగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు visionary Four Ps Model – People, Public, Private, Partnership – ఆధారంగా ఈ శుభాకాంక్ష వేదిక ద్వారా కోనసీమ పారిశ్రామిక పునరుజ్జీవన దిశగా అడుగులు వేస్తోందన్నారు.