40.2 C
Hyderabad
April 19, 2024 17: 58 PM
Slider విజయనగరం

స్నిప‌ర్ టీమ్ తో అసాంఘీక కార్య‌క‌లాపాల‌‌పై నిఘా

#Vijayanagaram Police

స్నిప‌ర్..అంటే…స్విప్ట్,నైట్,ఇంపాక్టివ్, ప్రివెన్టివ్, ఎమ‌ర్జ‌న్సీ, రెస్పాన్స్. swift,night, impactive, preventive, emergnecy, responce. ఈ ర‌క‌మైన ఉద్దేశ్యంతో చ‌ట్టానికి అతీతంగా అసాంఘీక కార్య‌క్ర‌మాలు, ప‌నులు కాని…ఎక్క‌డెక్క‌డ జ‌రుగుతున్నాయో….తెలుసుకుని త‌మ ఉన్న‌తాధికారికి చెప్పేది…ఈ స్నిప‌ర్ టీమ్.

విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ…ఎస్పీగా ప‌దివి చేప‌ట్టిన వెంట‌నే ఈ స్నిప‌ర్ టీమ్ ను ఏర్పాటు చేసారు. జిల్లాలో గుట్కా,పేకాట‌, వ్య‌భిచారం వంటి అసాంఘీక చ‌ర్య‌లు ఎక్క‌డ జరిగినా వెను వెంట‌నే ఈ టీమ్  తెలుసుకుని దానిని స‌మూలనంగా అరికట్టే ప‌నులు చేప‌డుతోంది..

ప్ర‌స్తుతం జిల్లా ఎస్పీగా రాజ‌కుమారీ బాధ్య‌త‌లు తీసుకున్న దాదాపు ఏడాదిన్న‌ర అవుతున్నా…ఎలాంటి అసాంఘీక కార్య‌క‌లాపాలు జ‌రిగిన దాఖ‌లు ఇంత‌వ‌ర‌కు స్నిప‌ర్ టీమ్ వ‌ద్ద‌కు రాలేదు. ఆరుగురు స‌భ్యుల‌తో మ‌ప్టీ లో ఉండే ఈ బృందం…జిల్లా వ్యాప్తంగా తిరిగి…సమాచారం సేక‌రించి…జిల్లా ఎస్పీకి అందిస్తుంది.

తొలుత ప్ర‌యోగాత్మ‌కంగా జిల్లా కేంద్ర‌మైన విజ‌య‌న‌గ‌రంలో రెండు బృందాలు ఏర్పాటు చేసారు…జిల్లా ఎస్పీ.ఒక్కో బృందంలో ఆరుగురు ఉంటూ రాత్రంతా న‌గ‌రం మొత్తం సంచ‌రించి…ప‌క్కా స‌మాచారం సేక‌రిస్తారు.  ఓ వైపు స్టేష‌న్ వారీగా ఉండే ఐడీ పార్టీ  నుంచీ మ‌రోవైపు స్పెష‌ల్ బ్రాంచ్ ఇచ్చే స‌మాచారంతో నేర‌గాళ్ల స‌మాచారాన్ని సేక‌రిస్తుంది..ఈ స్నిప‌ర్ టీమ్.

తొలుత ఆర్మ‌ర్డ్ రిజ‌ర్వు డీఎస్పీ ఆధ్వ‌ర్యంలో ఈ స్నిపర్ టీమ్ న‌డిచినా…ప్ర‌స్తుతం స్పెష‌ల్ బ్రాంచ్ ఆధ్వ‌ర్యంలో ఈ టీమ్ ప‌ని చేస్తోంది. ఏదైనా అసాంఘిక కార్య‌క్ర‌మాల‌కు జిల్లా అడ్డ‌గా మార‌కుండా..ఇలాంటి టీమ్ ల ఉండాల‌ని కోరుతున్నారు…న‌గ‌ర వాసులు.

Related posts

ప్రత్యామ్నాయ విధానాల సాధనకోసం ఐక్య పోరాటాలు  

Murali Krishna

కనక దుర్గ అమ్మవారిని దర్శించిన మంత్రి రోజా

Satyam NEWS

ఎమ్మెల్యే మేడాతో భేటీ అయిన రాజేశ్వరి

Satyam NEWS

Leave a Comment