Slider మహబూబ్ నగర్

గ్రామాలలో సబ్బులు, మాస్కులు పంచిపెట్టిన సేవాసంస్థ

Singotam Village

కరోనా మహమ్మారి  విస్తరిస్తున్న నేపథ్యంలో సింగోటం గ్రామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మాస్కులు, సబ్బులను పంపిణీ చేశారు. గురువారం కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామ స్వచ్ఛంద సేవా సంస్థ వారు ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జవాయి పల్లి గ్రామంలో  2100 మాస్కులు,  1100 సబ్బులను ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేశారు.

అదేవిధంగా  బాడిగ దిన్నె గ్రామం లో 200 మాస్కులు,100 సబ్బులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  సంస్థ సభ్యులు మాట్లాడారు. 2012 సంవత్సరం స్థాపించిన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామన్నారు.  ముఖ్యంగా వృద్ధులకు కంటి వైద్య చికిత్సలు,రెడ్ క్రాస్ బ్లెడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు,అనేక కార్యక్రమాలు చేశామని తెలిపారు.

అదేవిధంగా కరోనా మహమ్మారి నుండి  జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా గ్రామ ప్రజలకు తెలియజేశారు. సబ్బుతో చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని,అదేవిధంగా ప్రతి ఒక్కరు  మాస్కులు ధరించాలని  వారు సూచించారు. ఈ కార్యక్రమంలో  సంస్థ అధ్యక్షులు  బాలకిష్టయ్య, ప్రధాన కార్యదర్శి  భాస్కర్, ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర, సభ్యులు, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.

Related posts

వసుధ వందనం

Satyam NEWS

బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు

Satyam NEWS

2న అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్ లో బతుకమ్మ ఉత్సవాలు

Satyam NEWS

Leave a Comment