39.2 C
Hyderabad
March 28, 2024 14: 17 PM
Slider విజయనగరం

విజయనగరం లో వైభవోపేతంగా హనుమాన్ శోభాయాత్ర

#sobhayatra

హనుమాన్ జయంతి సందర్భంగా విజయనగరం అంతా కాషాయ మయం అయ్యింది. హిందూ ధర్మరక్ష సమితి ఆధ్వర్యంలో విజయనగరం కోట నుంచీ వేలాదిమంది హిందువులతో 14 అడుగు ల ఆంజనేయ విగ్రహం తో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ శోభాయాత్ర కు..ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాధా మనోహర్ హాజరయ్యారు.

జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన విజయనగరం…!

హనుమాత్జయంతి సందర్భంగా విజయనగరం లో హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్ర లో పోలీసులు, బీజేపీ నేతలు… ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు..నగర ప్రజలతో వైభవోపేతంగా కొనసాగింది. నగరంలో ని కోట జంక్షన్ వద్ద ప్రారంభమైన ఈ శోభాయాత్ర ..మూడు లాంతర్లు ,గంటస్థంభం ,కన్యకపరమేశ్వరీ దేవాలయం… సీఎం ఆర్ ,రైల్వే స్టేషన్ మయూరీ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, అంబేద్కర్ జంక్షన్ మీదుగా తిరిగి కోట కు చేరనుంది.

ఈ సాయంత్రం 05.30 ప్రారంభమైన శోభాయాత్ర… గంట వ్యవధి లో సమీపంలో ఉన్న మూడులాంతర్ల వరకు మాత్రమే చేరకుంది.ఈ శోభాయాత్ర లో కోలాటం ,కాళీమాత ,ఆధ్యాత్మిక గురువు రాధా మనోహర్ దాస్..ప్రత్యేక ఆకర్షణగా బులెట్ పై పాల్గొనడం ప్రత్యేకత.కాగా… మొత్తం దాదాపు 270 మంది పోలీసులతో వన్ టౌన్, టూటౌన్ సీఐలు డా.వెంకటరావు, లక్ష్మణరావు, ఎస్ఐ భాస్కరరావు, మురళి ,అశోక్ ,ప్రసన్న కుమార్.. మహిళా పోలీసులతో భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు.

Related posts

దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఉగ్రవాదుల కదలిక

Satyam NEWS

వి ఎస్ యూ లో ఆడియో వీడియో విజువల్ సెంటర్ ప్రారంభం

Bhavani

మానసిక దివ్యాంగుల తో బతుకమ్మ సంబరాలు

Satyam NEWS

Leave a Comment