31.2 C
Hyderabad
April 19, 2024 03: 10 AM
Slider ప్రత్యేకం

సోషల్ మీడియాపై పాత కక్షలు తీర్చుకుంటున్నారు

social media

ఒకప్పుడు ఈ దేశంలో అంటరానితనం, మహిళల విద్యను అడ్డుకోవడం లాంటి దురాచారాలు ఉండేవి. అలా ఏళ్లతరబడి జరిగింది. కొందరు మహానుభావులు జన్మించారు. అలాంటి దురాచారాలపై పోరాటం చేశారు. అక్కడ నుంచి కొంత మేరకు పురోగమించాం.

కాలం మారేకొద్దీ పెరుగుతున్న టెక్నాలజీ కి  తగ్గట్టుగా జనరేషన్ తయారైంది. మీడియా విషయానికి వస్తే ముందు ప్రింట్ మీడియా ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాయి. అయితే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు పార్టీలకు బాకాలు ఊదడం ప్రారంభమైంది. తర్వాత రాజకీయ పార్టీలే మీడియా ప్రారంభించుకున్నారు.

సమాజంలో పార్టీ వార్తలు తప్ప నిజాలు రావడం ఆగిపోయింది. సామాజిక సమస్యలపై పోరాడేవాడు లేకుండా పోయాడు. పార్టీకి బాకా ఊదడం, సంబంధిత రాజకీయ నాయకులను ఆకాశానికి ఎత్తడం, ప్రత్యర్థిని చిత్తుగా విమర్శించడం తప్ప వేరే పనిలేని మీడియా తయారైంది.

ఈ పక్షపాత మీడియాకు వ్యతిరేకంగా సోషల్ మీడియా రూపుదిద్దుకుంది. ఈ పార్టీ పక్షపాత మీడియాలు వెలికి తీసుకురాని విషయాలను సోషల్ మీడియా బయటకు తీసుకువస్తున్నది. నాయకులు, అధికారులు ఎవ్వరు తప్పుచేసినా ఇప్పటి జనరేషన్ సోషల్ మీడియా ద్వారా  నిలదీస్తున్నారు.

న్యూస్ మీడియా పని చేయని విధాంగా  సోషల్ మీడియా పనిచేస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరిగినా సోషల్ మీడియా ద్వారా నిమిషాలలో ఆధారాలతో  తెలిసిపోతుంది. సోషల్ మీడియాకు క్రేజ్  వచ్చింది. న్యూస్ మీడియా,పత్రికల నుండి కొందరు మేధావులు బయటికి వచ్చి సొంతంగా యాప్ లు పెట్టుకున్నారు.

దానితో న్యూస్ అందిస్తున్నారు. దీనితో భజనలు చేసే న్యూస్ మీడియాకు చెమటలు పడుతున్నాయి. ప్రజలు స్మార్ట్ ఫోన్ లో యాప్ లు డౌన్ లోడ్ చేసుకొని చూస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు ఒక సమాజంపై బాధ్యతతో వచ్చిన న్యూస్ ను షేర్, ఫార్వార్డ్ చేస్తునారు.

దీనిని జీర్ణించుకొని న్యూస్ మీడియా సోషల్ మీడియాపై ఇటీవల పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నది. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అంటూ సినిమా డైలాగ్స్ సొల్లు కబుర్లు చెప్పే మీడియా చానల్ ఈ మధ్యనే ఎంగిలి మెతుకులు, తినేసిన ముక్కలకు ఆశ పడిన న్యూస్ మీడియా అంటూ కొందరు ఎత్తి పోశారు.

అయినా వాళ్లలో మార్పు రాలేదు. సోషల్ మీడియా పై సెటైర్లు వేస్తున్నారు. తొక్కే కుట్రలు చేస్తున్నారు. వాళ్ల  రెవెన్యూ కోసం అరె, ఒరే  అంటూ తోలు బొమ్మల వేషాలు వేస్తున్నారు. న్యూస్ మీడియా ఇప్పుడు సోషల్ మీడియాను టార్గెట్ చేసుకుంది.

కొన్ని తప్పులు, అసత్యాలు వస్తుంటాయి వాటిని చూసుకోవడానికి అధికారులు వుంటారు. వాళ్ల పని వాళ్లు చేసుకుంటారు. కానీ వీళ్ల తోలు బొమ్మల వేషాలతో ఎక్కువ చేస్తున్నారు. సోషల్ మీడియా వాట్సప్ గ్రూప్ లలో అధికారులు వుంటారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల వాళ్లు వుంటారు.

అసత్య ప్రచారాలు చేస్తే అందరికి తెలిసిపోతుంది చర్యలు తీసుకుంటారు. మధ్యలో వీళ్లకెందుకు? వాళ్లేదో అన్నీ కరెక్టుగా చెబుతున్నట్లు సోషల్ మీడియా పై అభాండాలు వేస్తుంటారు. సుప్రీం కోర్టు ఇది వరకే చెప్పింది. మతాలను,వ్యక్తులను కించ పరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు  చేయకుడదని.

చాలా మంది దాన్ని ఫాలో అవుతున్నారు కూడా. ఇప్పుడు కరోనా వార్తలను ప్రచారం చేయకూడదనే చట్టం తీసుకువచ్చి పాత కక్షలు తీర్చుకుంటున్నారు. కరోనా పై జాతీయ స్థాయి మీడియా కూడా డాక్టర్లపై ఉమ్మి వేసే వీడియోలు ప్రసారం చేశాయి. అలాంటి వారిపై చర్య తీసుకోలేని అధికారులు, స్థానిక మీడియా పెద్దలు ఇప్పుడు సోషల్ మీడియా పై పడి తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారు.

Related posts

హైదరాబాద్ వరద బాధితులకు ఢిల్లీ సిఎం విరాళం

Satyam NEWS

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

Bhavani

రోడ్డు ప్రమాదాలలో 10 మంది మృతి

Bhavani

Leave a Comment