27.7 C
Hyderabad
April 24, 2024 09: 30 AM
Slider విజయనగరం

పోలీసు నిబంధనలపై సోషల్ మీడియాలో అవాకులుచవాకులు

#rajakumariIPS

గ‌త రెండు రోజుల నుంచీ జిల్లాలోని ఏ జంక్ష‌న్ లో చూసినా…ఎస్ఐ,సీఐ స్థాయి అధికారులే ఉంటూ ఎస్పీ సూచ‌న‌ల మేర‌కు క‌రోనా ప‌ట్ల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తునే ఉన్నారు.దీంతో అటు ప్రజ‌ల‌లో చాలా వ‌ర‌కు మార్పు వ‌చ్చి…ప‌న్నెండు లోపు ఇండ్ల‌లో ఉండే విధంగా ఆఫీసు కాని వ్యాపార కార్య‌క‌లాపాల‌ను ముగించుకుని ఇంటికి ప‌య‌న‌మ‌వుతున్నారు.

అయితే క‌రోనా వైర‌స్ త‌గ్గించేందుకు ఎస్పీ తీసుకున్న ఈ  ఆక‌స్మిక  తాత్కాలిక నిర్ణ‌యాలు…ప్ర‌జ‌ల‌లో కొంత‌మంది మార్పున‌కు శ్రీకారం చుట్ట‌గా మ‌రి కొంద‌రు పొమ్మ‌న‌లేక పొగ‌బెట్టిన‌ట్టు..సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి ప‌రోక్షంగా ఏకంగా పోలీస్ శాఖ‌నే తిట్ట‌డం మొద‌లు పెట్టారు.

దీన్ని దృష్టిలో పెట్టుకుని..ఎస్పీ ఉన్న ప‌ళంగా గ‌త సాయంత్రం త‌న ఛాంబ‌ర్ లో టౌన్ డీఎస్పీ,ట్రాఫిక్ డీఎస్పీ ,సీఐల‌తో స‌మావేశం నిర్వ‌హించి మ‌రీ…క‌ర్ఫ్యూ లాక్ డౌన్  ముగింపు 12 గంట‌లే అన్న విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు చెబుతూ..శాఖా సిబ్బందిని 12.30 వ‌ర‌కు వెయిట్ చేసి..అప్పుడు జంక్ష‌న్ల‌ను క్లోజ్ చేయ‌డం పబ్లిక్ కు అవ‌ర్నేస్ క‌లిగించ‌డం వంటి చర్య‌లు చేప‌ట్టాల‌ని ఎస్పీ సూచించారు.

దీంతో య‌ధావిధిగా క‌రోనా సంద‌ర్బంగా క‌ర్ఫ్యూ స‌డ‌లింపు స‌మ‌యం అయ్యేస‌రికి చెక్ పోస్ట్ ల వ‌ద్ద‌,జంక్ష‌న్ల వ‌ద్ద ఎస్టీఎఫ్ సిబ్బందితో అలెర్ట్ అవుతున్న పోలీసులు…3 వ తేదీ మ‌ధ్యాహ్నం 12  అయినా..ఎటువంటి హాడావుడి క‌నిపించ‌లేదు.

అదేస‌మ‌యంలో ఎస్పీ రాజ‌కుమారీ  ఆర్టీసీ కాంప్లెక్స్  మీదుగా బాలాజీ ,కోట‌,మూడు లాంత‌ర్లు ,గంట‌స్థంభం వ‌ద్దకు చేరుకుని అక్క‌డ క‌ర్ఫ్యూ స‌డ‌లింపు సమ‌యంలో న‌గ‌ర ప‌రిస్థితిని ప‌రిశీలించారు. అదే స‌మయానికి ట్రాఫిక్ డీఎస్పీ మోహ‌న్ రావు స‌డ‌లింపు స‌మ‌యం ముగుస్తున్నా..ఇంకా జ‌నాలు రోడ్ల‌పై ఉండ‌టాన్ని చూసి…త‌న సిబ్బందితో అవేర్నేస్ క‌ల్పించి…ఇండ్ల‌కు పంపించి వేసారు.

కర్ప్యూ స‌డ‌లింపు స‌మయం పొడిగింపుపై స్ప‌ష్టత ఇచ్చిన ఎస్పీ…!

క‌ర్ఫ్యూ స‌డ‌లింపు స‌మ‌యం పొడిగించార‌న్న వార్త‌లో వాస్త‌వం లేద‌ని జిల్లా సూప‌రెంటెండెంట్ రాజ‌కుమారీ స్ప‌ష్టం చేసారు. లాక్ డౌన్ స‌మ‌యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మ‌రో ప‌ది రోజుల పాటు పొడిగించిన సంగ‌తి తెలిసిందే. దీంతో పోలీస్ శాఖ ఆదేశాల  మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, న‌గ‌ర క‌మీష‌న‌ర్లు…క‌ర్ఫ్యూ పొడిగింపు స‌మ‌యం ఆధారంగా చేసుకుని ఆయా జిల్లాలో సిబ్బంది బందోబ‌స్తునైట్ పికెటింగ్, గ‌స్తీ బందోబ‌స్తు వంటి వాటిపై దృష్టి పెట్టారు.

ఈ ప‌రిస్థితుల‌లో ప్ర‌స్తుతం ఉద‌యం ఆరుగంట‌లు పాటు అంటే ఉద‌యం 6 నుంచీ 12 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ లాక్ డౌన్ స‌డ‌లింపును ఓ అర‌గంట పాటు పొడిగించార‌ని అదీ 12.30 వ‌ర‌కు పెంచార‌న్న వార్త‌లు సోష‌ల్ మీడియాలోనూ కొంత‌మంది పోలీస్ అధికారులు  అనకున్న‌మాట‌లు.

ఉద‌యం పూట క‌ర్ఫ్యూ స‌డ‌లింపు స‌మయాన్ని ఏమైనా అర‌గంట పెంచారా అంటూ ఎస్పీని ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు ఎస్పీ  స‌మాధాన మిస్తూ..అలాంటి పొడిగింపు ఆదేశాలేమీ లేవు ..అటువంటివి అస్స‌లు ఇవ్వ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.

గడ‌చిన రెండు రోజులుగా పోలీసు ప‌నేంటే త‌మ శాఖ సిబ్బంది చేసి చూపించేస‌రికి ప్రజ‌ల‌నుంచీ వాట్సాప్ ల ద్వారా,పోష‌ల్ మీడియాల‌లో  వివ‌రీతైన వ్యాఖ్య‌లు,కామెంట్స్ వ‌స్తున్నాయ‌న్నారు. అస్స‌లు ఉద‌యం పూట  ఆరు గంట‌ల పాటు క‌ర్ఫ్యూ స‌డ‌లింపు అనేది రాష్ట్ర డీజీపీ ఇచ్చిన ఆదేశాల‌న్నారు.

ఈ ఆదేశాల‌ను ఖ‌చ్చితంగా కింది స్థాయి సిబ్బంది చేత పాటించేలా చేయించ‌డ‌మే త‌మ ప్ర‌ధాన క‌ర్త‌వ్య‌మ‌ని అని అన్నారు. ఇంత‌వ‌ర‌కు 12 గంట‌ల‌కు ఉన్న క‌ర్ఫ్యూ స‌డ‌లింపు స‌మ‌యం…పూర్తిగా ప్ర‌జ‌లంద‌రికీ వ‌ర్తిస్తుంద‌ని..అయితే త‌న శాఖా సిబ్బందికి మాత్రం ఆ టైమ్ తో క‌ట్ట‌డి చేయ‌కుండా మ‌రో  అర‌గంట వేచి చూడాల‌ని మాత్ర‌మే ఆదేశాలు ఇచ్చామ‌ని ఎస్పీ వివ‌ర‌ణ ఇచ్చారు.

Related posts

“స్వంత లాభం కొంత మానుకో” తోనే పవన్ పార్టీ లో చేరా

Satyam NEWS

నంద్యాలలో కానిస్టేబుల్ దారుణ హత్య

Satyam NEWS

వైభవంగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం

Bhavani

Leave a Comment