27.7 C
Hyderabad
April 25, 2024 10: 49 AM
Slider శ్రీకాకుళం

డేవిడ్ ను అభినందించిన జిల్లా కలెక్టర్ కేశ్ బాలాజీ

#srikakulam collector

కోవిడ్ -19  మొదటి వేవ్,  రెండవ వేవ్ లో శ్రీకాకుళం జిల్లా తారకరామా & మోక్షజ్ఞ సేవా సంఘం సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ కేశ్ బాలాజీ అన్నారు.

కరోనా సమయం లో నందమూరి తారకరామా మోక్షజ్ఞ సేవా సంఘం,  డేవిడ్ టీం సంయుక్తంగా ఫ్రెంట్ లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బందికి, నర్సులకు,  పోలీస్ వారికి,  పారిశుధ్య కార్మికులకు,  రోజూ మజ్జిగ,  శానిటే జెర్స్,  మాస్క్ లు పంపిణీ చేశారు.

అలాగే పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించారు. రోజూ 100 మంది పాదచారులకు భోజనం అందించే వారు. ముఖ్యం గా కరోనా సమయం లో  బ్లడ్ బ్యాంక్ లో, హాస్పిటల్ లో రక్త నిల్వలు  లోటు ఏర్పడటం తో  జిల్లా  రెడ్ క్రాస్  వారు పిలుపు మేరకు  జిల్లా లో రక్త దాన కార్యక్రమం నిర్వహించారు.

గర్భిణీ స్త్రీలకు,  తలసీమియా  పేషేంట్స్ కోసం ఈ రక్తాన్ని దానం చేశారు. న్యూ బ్లడ్ బ్యాంక్,  లయన్స్ క్లబ్  ఇంకా కొన్ని  స్వచ్ఛంద సేవా సంఘాలకు తమ టీం,  సేవా సంఘం సహకరించిందని శ్రీకాకుళం జిల్లా తారకరామా & మోక్షజ్ఞ సేవా సంఘం అధ్యక్షులు డేవిడ్  తెలిపారు.

జిల్లా కలెక్టర్ బాలాజీ ఈ సేవలను అభినందించి  సంఘ అధ్యక్షులు డేవిడ్ ను శాలువా కప్పి సత్కరించారు.

Related posts

విద్యార్థులకు విజయనగరం ఎస్పీ కరోనా “క్లాస్”

Satyam NEWS

దళిత యువకుల పై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి 

Satyam NEWS

శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌజ్ లో రెండో సారి మంటలు

Satyam NEWS

Leave a Comment