38.2 C
Hyderabad
April 25, 2024 12: 49 PM
Slider హైదరాబాద్

జగన్ గురూజీ ఆధ్వర్యంలో వేసవిలో ఉచిత సేవలు

JaganGuruji

రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పాదచారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు తమ వంతు ప్రయత్నంగా మజ్జిగ, నిమ్మకాయ రసం పంపిణీ చేసేందుకు కూకట్ పల్లీ హౌసింగ్ బోర్డ్ లోని యోగ విజ్ఞాన కేంద్రం ముందుకు వచ్చింది.

యోగ విజ్ఞాన కేంద్రం సంస్థ వ్యవస్థాపకులు జగన్ గురూజీ ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలుగా ఆయుర్వేద విద్యా, ఆహార విద్యా నేర్పిస్తూ సమాజ సేవలో నిమగ్నమై ఉన్న ఈ సంస్థ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నది.

కరోనా సమయంలో 62 రోజుల పాటు రోజుకు రెండు వేల మందికి చొప్పున ఆహారం అందచేశారు. ప్రతి రోజూ ఆసుపత్రులకు వచ్చే వారికి సుమారు 700 మందికి పైగా ఆహారం అందజేయడం సేవా కార్యక్రమంలో భాగంగా పెట్టుకున్నారు.

అదే సేవ దృక్పథంతో ఇప్పుడు 150 రోజులపాటు బాలానగర్ చౌరస్తా నుండి మియాపూర్ చౌరస్తా వరకు మజ్జిగ, నిమ్మకాయ రసం పంచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

దీనిలో భాగంగా ఈరోజు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో లో ఈ కార్యక్రమాన్ని కూకట్పల్లి ఏసీపి సురేందర్రావు, సి ఐ నరసింహ రావు తో కలిసి యోగ విజ్ఞాన కేంద్రం సంస్థ వ్యవస్థాపకులు జగన్ గురూజీ ప్రారంభించడం జరిగింది. నిత్యం ఈ సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగుతాయని వారు తెలియజేశారు.

ఈ సందర్భంగా కూకట్పల్లి సిఐ నర్సింగ్ రావు మాట్లాడుతూ ఇలాంటి మంచిపని చేయడం ఎంతో హర్షదాయకం చౌరస్తాలో ఉండే తమ సిబ్బందికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఇలానే మరిన్ని సేవలు చేస్తూ ముందుకు వెళ్లాలని వారు సూచించారు.

Related posts

గద్దల రమేష్ పై రామగుండం పోలీసుల పీడీ యాక్ట్

Satyam NEWS

వనపర్తిలో శ్రమదానం చేసిన వైస్ వాకిటి శ్రీధర్

Satyam NEWS

హార్డ్ లాండింగ్:రన్‌వేపై నుంచి రోడ్డుమీదకు విమానం

Satyam NEWS

Leave a Comment