30.2 C
Hyderabad
April 27, 2025 19: 33 PM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

ఏపిలో పెట్టుబడులకు ‘సాఫ్ట్‌ బ్యాంక్‌’ ఆసక్తి

Minister-Mekapati-Goutham-R

జపాన్ దిగ్గజ సంస్థ ‘సాఫ్ట్ బ్యాంక్’ ఏపీలో విద్యుత్ వాహన రంగంలో ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉంది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ  శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో  సాఫ్ట్ బ్యాంక్   చర్చించింది. సోమవారం హైదరాబాద్ లోని లేక్ వ్యూ అతిథి గృహంలో జరిగిన బిజినెస్ ఔట్ రీచ్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో సాఫ్ట్ బ్యాంక్ ప్రతినిధి బృందం మంత్రిని కలుసుకుని చర్చలు జరిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ఏ రంగంలో పెట్టుబడులకైనా ఏపీలో ఉన్న అనుకూల వాతావరణం గురించి మంత్రి మేకపాటి ప్రతినిధులకు వెల్లడించారు. సంక్షేమం, పరిశ్రమల వృద్ధిని సమాన స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారని మంత్రి వారికి తెలిపారు. కొత్త సంవత్సరం కల్లా పరిశ్రమలకు అనుకూలమైన పారదర్శక పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తామని మంత్రి వివరించారు. యువతకు ఉపాధి, మౌలిక వసతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలైన పరిశ్రమలలో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు, యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు వంటి అంశాలపై మంత్రి ప్రతినిధులకు వివరించారు. ఆ నిర్ణయాలపై ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా.. గొప్ప నిర్ణయాలని వారు కొనియాడారు. పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కలిసి ముందుకు సాగేందుకు ఆసక్తిగా ఉన్నామని మంత్రితో అన్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు. రెండు వారాల్లో స్పష్టమైన ప్రణాళికతో మరో సారి భేటీ అయి పూర్తి వివరాలు అందించాలని మంత్రి కోరారు. ఆ తర్వాత సాఫ్ట్ బ్యాంక్ ప్రతిపాదనలను స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని మంత్రి తెలిపారు. అందుకు ప్రతినిధి బృందం అంగీకారం తెలిపారు.

Related posts

గేదెపై దాడి చేసిన బెంగాల్ టైగర్

Satyam NEWS

సత్యం న్యూస్ కథనంతో కదిలిన పోలీసు యంత్రాంగం

Satyam NEWS

హత్యా రాజకీయాలు చేస్తున్న సీఎం కేసీఆర్

mamatha

Leave a Comment

error: Content is protected !!