Slider ముఖ్యంశాలు

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబంతో సహ ఆత్మహత్య

sucide

ఆర్ధిక కారణాలతో ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన కుటుంబంతో సహా అర్ధంతరంగా జీవితం చాలించాడు. హైదరాబాద్ శివారులోని మీర్‌పేట పరిధిలోని అల్మాస్ గూడాలో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హరీశ్ హరీష్‌, ఆయన భార్య స్వప్న పిల్లలు గిరీష్‌, సువర్ణ ఆత్మహత్య చేసుకున్నారు.

అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో నివసిస్తున్న వీరు గత రెండు రోజులుగా బయటకు రాకపోవడంతో అనుమానించిన ఇరుగుపొరుగు వారు ఇంటికి వెళ్లి చూడగా ఈ దుర్ఘటన బయట పడింది. ‘ఈ తలుపు తెరవండి ప్లీజ్’ అనే కాగితం అతికించి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపు తెరిచి చూడగా కుటుంబ సభ్యులు నలుగురు విగత జీవులుగా కనిపించారు. వారి ఫోన్ ఆధారంగా పోలీసులు వారి బంధువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారంతా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Related posts

ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ గా చిరంజీవి

Satyam NEWS

4 రోజుల్లో పోడు పట్టాల పంపిణీ పూర్తి చేయాలి

mamatha

నల్ల జీవోను తగలబెట్టిన తెలుగుదేశం

mamatha

Leave a Comment