28.7 C
Hyderabad
April 20, 2024 09: 27 AM
Slider శ్రీకాకుళం

బోన్ క్యాన్సర్ పాపకి దొరబాబు ఆర్థిక సహాయం

#Parlakimidi

శ్రీకాకుళం రూరల్ మండలం  పెద్దపాడు గ్రామంలో గల పొందర వీధికి చెందిన గంగాధర హారిక ఎముకల క్యాన్సర్ తో బాధపడుతుంది. వైద్యానికి లక్షలు అవసరమని డాక్టర్లు తెలపడంతో ఈ విషయం తెలుసుకున్న ఒడిషా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాకిమిడి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్తపల్లి దొరబాబు బాలిక ట్రెట్మెంట్ ఖర్చులకు రూ.5000 అందించారు.

ఈ పాప తల్లిదండ్రులు రోజువారి కూలీలు. ఈమె పెద్దపాడు ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది, ఈమె పరిస్థితి బట్టి సహాయం అందించే  దాతలు ముందుకు రావాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దపాడు ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గుండా బాల  మోహన్ , తంగి వాణి పేట ప్రాథమిక ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు కింజరాపు నరేష్  తదితరులు పాల్గొన్నారు.

అలాగే మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని  చేయవలసిన  సెల్ నెంబరు 7093992533, ఫోన్ పే నెంబర్ 9182018180 గోవిందరావు, బ్యాంక్ ఎకౌంటు నెంబరు 73153213321, ఐ.ఎఫ్.ఎస్సి. కోడ్. నెంబరు ఏ.పీ.జీ.వీ.బీ 0001182, పెద్దపాడు  బ్రాంచ్, శ్రీకాకుళం రూరల్ మండలం.

Related posts

పసుపులేటి రామారావు కుటుంబానికి అండగా ఉంటా

Satyam NEWS

డేంజర్ బెల్స్: కామారెడ్డిని తాకిన కరోన వైరస్

Satyam NEWS

ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఎంపికి ఏడాదిన్నర జైలు శిక్ష

Satyam NEWS

Leave a Comment