31.2 C
Hyderabad
April 19, 2024 05: 28 AM
Slider విజయనగరం

విజ‌య‌న‌గ‌రంలోని ట్రాఫిక్ స‌మ‌స్య‌పై స్థానిక‌ ఎమ్మెల్యే స‌మాలోచ‌న‌లు

#vijayanagarampolice

ఇటీవ‌లే పుర‌పాల‌క‌ సంఘం నుంచీ కార్పొరేష‌న్ కు ఎదిగిన విజ‌య‌న‌గరాన్ని ప్ర‌ధానంగా ట్రాఫిక్ స‌మ‌స్య ప‌ట్టిపీడిస్తోంది. ప్ర‌స్తుత ఈ స్పీడ్ యుగంలోనూ అందునా ప్ర‌తీ ఒక్క‌రూ స్మార్ట్ ఫోన్ ల‌ను ఉప‌యోగిస్తున్న వేళ మీడియాకూడా కొత్త పుంత‌లు తొక్కుతున్న సంద‌ర్భంలో త‌న కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న స‌త్యం న్యూస్.నెట్  కూడా బ‌ర్నింగ్ స‌మస్య‌ల‌పై ట్రాపిక్ పై స్పాట్ ల‌తో పాటు క‌థ‌నాలు వాటి  ప‌రిష్కారం కొర‌కు ఓ బాద్య‌తాయుతంగా ప్ర‌చురిస్తూ వ‌స్తోంది.

ఈ క్ర‌మంలోనే న‌గ‌రంలోని ట్రాఫిక్ ర‌ద్దీని స‌మ‌స్య‌ను స్వ‌యంగా ఎదుర్కొన్న స్థానిక ఎమ్మెల్యే, ఉత్త‌రాంధ్ర‌ వైఎస్ఆర్సీపీ నేత కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి రంగంలోకి దిగారు.మొన్నీ మ‌ధ్య‌నే ఎస్పీ  నిర్వ‌హించిన స‌మావేశంలో   జిల్లా కేంద్ర‌మైన విజ‌య‌న‌గ‌రంలో త‌ర‌చూ పెరుగుతున్న వాహ‌నాలు,ఇరుకురోడ్ల‌తో   ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయ‌ని దీనికి శాఖా ప‌రంగా చర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు  ప‌లు సూచ‌న‌లు ఇచ్చారు.

అయితే అందుకు ప్ర‌జాప్ర‌తినిధులు చొర‌వ తీసుకుంటే….శాఖా ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు పెద్ద‌లు సూచ‌న‌లు కూడా ఇచ్చారు..కాగా ఇటీవ‌లే న‌గ‌రంలో ట్రాపిక్ స‌మ‌స్య, ర‌ద్దీ నివార‌ణ‌కు ఎస్పీ దీపిక ఆదేశాల‌తో ,ట్రాఫిక్ డీఎస్పీ మోహ‌న్ రావు సూచ‌న‌ల మేర‌కు ట్రాఫిక్ ఎస్ఐలు భాస్క‌ర‌రావు, దామోద‌ర‌రావు,హ‌రిబాబులు త‌న సిబ్బందితో ఎప్ప‌టిక‌ప్ప‌డు ట్రాఫిక్ ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించడంతోపాటు రూల్స్ ను అతిక్రమించిన వారపై జ‌రిమానా విధించ‌డం జ‌రుగుతోంది కూడా.

అలాగే ట్రాఫిక్ ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌డంలో…నిత్యం ఎదురవుతున్న ర‌ద్దీని  నియంత్రించేందుకు ట్రాఫిక్  ఎస్ఐలు ఓ ప్ర‌ణాళిక‌ను కూడా రూపొందించారు. బెజ‌వాడ‌లోని బెంజ్ స‌ర్కిల్ లోమాదిరిగానే  విజయ‌న‌గ‌రంలో  ప్ర‌ధాన రోడ్ అయిన మూడు లాంత‌ర్ల నుంచీ డాబా గార్డెన్స్ వ‌ర‌కు  ఉన్న రోడ్ మ‌ద్య‌లోనే పార్కింగ్ ఏర్పాటు చేసే యోచ‌న‌లో ఉంది ట్రాఫిక్ విభాగం.

ఈ నేప‌ధ్యంలో స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌పై తీసుకోవ‌ల‌సిన ,తీసుకోనున్న చ‌ర్య‌ల‌పై  ట్రాపిక్ పోలీసుల‌తో చ‌ర్చించాల‌ని స్వ‌యంగా త‌న పీఎ ద్వారా  ఓ లెట‌ర్ కూడా పంపించిన‌ట్టు స‌మాచారం. దీంతో  మ‌రో రెండు రోజుల్లో  న‌గ‌ర ట్రాఫిక్ స‌మ‌స్య‌పై ప్ర‌జాప్ర‌తినిదులు,ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూర్చున ఓ ప్ర‌ణాళిక రూపొందించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.ఏదైనా ఇప్ప‌టికైనా న‌గ‌ర ట్రాఫిక్ స‌మ‌స్య నివార‌ణ‌కు ఒక అడుగు ప‌డింద‌ని అంటోంది.స‌త్యం న్యూస్.నెట్

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

ఇసుక అక్రమ రవాణా అంశం లో అధికారుల సస్పెన్షన్

Satyam NEWS

కరోనా హెల్ప్: పేదలకు పద్మశాలీ సంఘం సహాయం

Satyam NEWS

భోగాపురం ఆర్అండ్ఆర్‌ కాల‌నీలో అన్ని స‌దుపాయాలు

Satyam NEWS

Leave a Comment