పుష్ప లో ఫేమస్ డైలాగు అంటే తగ్గేదే లే. పుష్ప ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు ఇది చాలా పాపులర్ అయింది. అంత పాపులర్ డైలాగు కు ఇప్పుడు అసలు అనే పదం ఆడ్ చేసి అసలు తగ్గదే లే అంటే ఫస్ట్ సారి వచ్చినంత కిక్ వస్తుందా?. ఇప్పుడు పుష్ప 2 విషయంలో కూడా అచ్చం అదే జరిగింది. ఫస్ట్ పార్ట్ కు కొనసాగింపుగా తెచ్చిన పుష్ప 2 ది రైజ్ కథ ఎక్కడా దారితప్పలేదు. కాకపోతే ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు వచ్చిన కిక్ మాత్రం ఈ సినిమాతో రాదూ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తెలిసిన కథను రెండవ పార్టీ ప్రేక్షకులను ఫుల్ ఎంగేజ్ చేసేలా చెప్పాలంటే అందుకే కథలో దమ్ము ఒక రేంజ్ లో ఉండాలి.
తెలిసిన ఎర్ర చందనం స్మగ్లింగ్ వ్యవహారమే దేశం దాటి విదేశాలకు పోతుంది. అంతకు మించి ఇందులో బలమైన అంశం ఏమి కనిపించదు. ఆ స్మగ్లింగ్ విషయంలో కూడా ఫస్ట్ పార్ట్ లో ఉన్న జోష్ సెకండ్ హాఫ్ లో లేదు అనే చెప్పాలి. విదేశాలకు ఎర్రచందం స్మగ్లింగ్ విషయంలో పుష్ప రాజ్, ఏపీ భన్వర్ సింగ్ షెకావత్ ల మధ్య వచ్చే ఛాలెంజ్..ఎత్తులు పై ఎత్తులు కూడా రొటీన్ గా ఉంటాయి కానీ వావ్ మూమెంట్స్ మాత్రం ఏమి లేవు అనే చెప్పాలి.. అయితే సినిమా మొత్తంలో కాస్త ఆసక్తికరంగా ఉన్న అంశం ఏమిటి అంటే సీఎం ను కలవటానికి వెళుతున్న పుష్ప రాజ్ ను సీఎం తో ఫోటో దిగి తీసుకురావాలని శ్రీవల్లి కోరటం…ఆ ఫోటో వ్యవహారమే సినిమా కథ మొత్తంలో ట్విస్ట్ కు ఆసక్తికరంగా మారుతుంది.
ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మ్యాన్ సినిమా ఎపిసోడ్ ను గుర్తుకు తెస్తుంది. ఇది కూడా సినిమాకు ఒకింత మైనస్ గా మారింది అనే చెప్పాలి. అయితే అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్ర కు ఎలివేషన్స్ ఒక రేంజ్ లో ఇచ్చారు. ఇందులో అల్లు అర్జున్ నటన కూడా ఆకట్టుకుంది. ఒక కూలీగా వచ్చి దేశంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ అంతా తన గుప్పిటలోకి తెచ్చుకోవటం కాకుండా..అంతర్జాతీయ స్థాయికి వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో అల్లు అర్జున్ వేసే ఎత్తులు కూడా ఆకట్టుకుంటాయి.
ఫస్ట్ పార్ట్ లో జరిగినట్లే భన్వర్ సింగ్ షెకావత్ కు రెండవ పార్ట్ లో కూడా దారుణ అవమానం జరుగుతుంది. ఇందులోనూ ఫహద్ ఫాజిల్ కు అంతా బలమైన పాత్ర దొరకలేదు అనే చెప్పాలి. కాకపోతే ఉన్నంత సేపు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. శ్రీవల్లి గా రష్మిక మందన్న తన పాత్రకు న్యాయం చేసింది. రావు రమేష్ , జగపతి బాబులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు. అయితే పుష్ప ది రైజ్ తో పోలిస్తే పుష్ప ది రూల్ లో మేజిక్ మిస్ అయింది అనే చెప్పాలి. ముందు నుంచి అనుకున్నట్లు శ్రీ లీల స్పెషల్ సాంగ్ కూడా ఫస్ట్ పార్ట్ లోని సమంత సాంగ్ తో పోలిస్తే తేలిపోతుంది. మిగిలిన పాటలు ఇప్పటికే ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొంది ఉన్నందున అది కూడా సినిమా కు అదనపు బలంగా నిల్వలేకపోయాయి అనే చెప్పొచ్చు.