కుటుంబ కలహాల కారణంగా అల్లుడు తన అత్త మామలపై దాడి చేసి అత్తను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం అడ్డూరు గ్రామంలో జరిగింది. అల్లుడు మామిడి పైడినాయుడు, అత్త,సానబోయిన లక్ష్మి మామ పైడిరాజులు మధ్య గత కొంత కాలంగా కుటుంబం కలహాలు జరుగుతున్నాయి. దాంతో నిన్న రాత్రి అత్త, మావయ్య లపై అతను కత్తితో దాడి చేశాడు. అల్లుడు చేసిన దాడిలో అత్త మృతి చెందింది. మావయ్య కు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను కేజీహెచ్ కు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో 2020లో అల్లుడు పైడినాయుడు పై ప్రేమ వ్యవహారంలో పోక్స్కో కేసు చోడవరంలో నమోదయింది. పోలీసులు నిందితుడు మామిడిరాజు ను అదుపులోకి తీసుకున్నారు.
previous post