Slider జాతీయం ముఖ్యంశాలు

కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియా

soniagandhi

లోక్ సభ ఎన్నికల ఫలితాల నుంచి అతలాకుతలం అవుతున్న కాంగ్రెస్ పార్టీ కుదటపడింది. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియాగాంధీనే సీడబ్ల్యూసీ ఎన్నుకుంది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా సీడబ్ల్యూసీలో నిర్ణయించారు. సుధీర్ఘ కసరత్తు, తర్జన భర్జన తర్వాత పార్టీ సోనియాను ఎన్నుకుంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్‌ అంగీకరించకపోవడంతో నేతలంతా కలిసి సోనియాగాంధీని అధ్యక్షురాలిగా ఎన్నుకున్నట్లు సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ ప్రకటించారు. సీడబ్ల్యూసీ భేటీ  అనంతరం సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ‘‘ రాహుల్‌గాంధీని అధ్యక్షుడిగా కొనసాగాలని సీడబ్ల్యూసీ కోరింది. రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు రాహుల్‌ నిరాకరించారు. దీంతో సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా సోనియాను అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని నిర్ణయించాం’’ అని తెలిపారు.

Related posts

ప్రయివేటు ఆసుపత్రులను తక్షణమే జాతీయం చేయండి

Satyam NEWS

సీఈ కాలనీ సమస్యలు పరిష్కరిస్తాం

Satyam NEWS

తరుగు పేరుతో ధాన్యం ధర తగ్గించడం అన్యాయం

Satyam NEWS

Leave a Comment