హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ప్రాంతంలోని మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో ఉన్న అలీనగర్ లో అక్రమంగా పశువుల వ్యర్థాలతో చేసిన నూనెతో సబ్బులు తయారు చేస్తున్న పరిశ్రమపై ఎస్వోటీ పోలీసులు నేడు దాడి చేశారు. పశువుల వ్యర్ధాలతో సబ్బులను తయారు చేస్తున్న ఈ పరిశ్రమ నుంచి దుర్గంధం వెలువడుతుంది. ఎస్వోటీ పోలీసులు ఈ కంపెనీ సమాచారం అందుకుని దాడి చేసి ముగ్గురుని అరెస్టు చేశారు. దానితో బాటు కంపెనీ ని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న నమూనాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) అధికారులకు అప్పగించారు.
previous post