జగద్గురువులు శంకరచార్య శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి దివ్య ఆశీర్వాదములతో విశాఖపట్నం శ్రీ కంచి కామకోటి శంకరమఠం లో ఈరోజు సౌందర్యలహరి ఏకాహం అత్యంత వైభవం గా జరిగినది. పుష్యమాసం శుక్రవారం నాడు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సౌందర్యలహరి ఏకాహం దాదాపు 12 గంటలు నిరవధికంగా సాగడం విశేషం. ఈ కార్యక్రమం కొడుకుల లక్ష్మీ కృష్ణవేణి ఆధ్వర్యంలో జరగగా సుమారు 900 మంది సువాసిని స్త్రీ మూర్తులు పాల్గొన్నారు. ఈ సౌందర్యలహరి పారాయణం చాలా ప్రత్యేకంగా వినూత్నం గా ఒక్కొక్క శ్లోకం ధ్యానం గా, 100 శ్లోకాలు 10 సార్లు జపించి కామాక్షి అమ్మ వారికి సమర్పించి అనుగ్రహపాత్రులు అయ్యారు. కార్యనిర్వాహక వర్గం అధ్యక్షులు Dr.T. రవిరాజు, confederation of Indian Industry chairman and managing Director గ్రంధి రాజేష్ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
previous post