సిద్దిపేట స్థానిక కొత్త బస్టాండ్ దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోర్డింగ్ ఉంది. ఆ హోర్డింగ్ కు అడ్డంగా మొక్కలు పెరిగిపోయాయి. ఏం చేయాలి? హోర్డింగ్ చాలా ఖరీదైనది కదా. అందుకోసం చీప్ గా ఉండే మొక్కల్ని నరుకుదామని అనుకున్నారు నిర్వాహకులు. అనుకున్నదే తడవుగా ఆ హోర్డింగ్ కు అడ్డంగా ఉన్న మొక్కల్ని నరికేశారు. తమ మాల్ హోర్డింగ్ చక్కగా కనిపిస్తున్నదని సంతృప్తిగా ఇంటికి వెళ్లారు. కానీ గతంలో లా తమ ఇష్టారాజ్యం చేయడం కుదరదని ప్రభుత్వ అధికారులు నిరూపించారు.
శివమ్స్ గార్డెన్ దగ్గర హరితరహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగిపోవడంతో అక్కడ ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోర్డింగ్ కనిపించడం లేదని మాల్ నిర్వాహకులు వాటిని నరికివేయడంపై తీవ్రంగా స్పందించారు. మున్సిపల్ అధికారులు సదరు షాపింగ్ మాల్ నిర్వాహకులకు రూ.45 వేల భారీ జరిమానాను విధించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను నరికినా లేదా ధ్వంసం చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.