40.2 C
Hyderabad
April 24, 2024 17: 58 PM
Slider ఆధ్యాత్మికం

సూర్య ప్రభ పై కుర్మావతారం లో శ్రీ సౌమ్యనాధ స్వామి…

#nandaluru

కడప జిల్లా నందలూరు లోని ప్రసిద్ద శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలల్లో ఏడో రోజు ఉదయం శ్రీ సౌమ్యనాధ స్వామి సూర్య ప్రభ వాహనం కుర్మావతారం లో దర్శన మిచ్చారు. నందలూరు లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయంలో బ్రహ్మోత్స వాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి.

ఈ సకల చరాచర సృష్టికి సూర్యుడే ఆధారం.. మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఆ ప్రత్యక్ష నారాయణుడే! ప్రకృతికి చైతన్యాన్ని ప్రసాదించేది కూడా ఆయనే! అందుకే సూర్యుడిని సూర్య నారాయణ అని కొలుస్తున్నాం.మహా తేజః పూర్ణమైన సూర్యప్రభ వాహనంలో విహరించిన సూర్యనారాయణుడిని దర్శించుకోవడమన్నది పూర్వజన్మ పుణ్యఫలం.ఆ స్వామిని దర్శిస్తే సకలసంపదలు చేకూరుతాయి.ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. సుఖశాంతులు లభిస్తాయి.

భక్త జనులు నలు వైపులా భక్తులు చేతులెత్తి మొక్కుతుండగా గోవింద నామ ఘోషల నడుమ కుర్మావతారం లో సూర్య ప్రభ పై విహరించారు.

మంగళ వ్యాయిద్యాలు, బాజా బజంత్రీలు మ్రోగుతుండగా, భక్తుల నీరాజనాల మధ్య సూర్య ప్రభ వైభవంగా సాగింది. బ్రహ్మోత్సవాల ఈ సందర్భంగా నందలూరుకు భారీగా భక్తులు తరలివచ్చారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయ ప్రాంగణం మొత్తం రంగు రంగు విద్యుత్ దీప కాంతులతో,తో మాలలతో, పుష్పాలతో అలంకరించారు.

ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాల కమిటీ అధ్యక్షుడు మేడా విజయ భాస్కర్ రెడ్డి, కల్యాణోత్సవ కమిటీ కార్య నిర్వహక కార్యదర్శి మేడా విజయ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

దేహపు పంజరం

Satyam NEWS

విద్యాసంస్థల రీ-ఓపెన్ కు కేంద్ర మార్గదర్శకాలు ఇవే

Satyam NEWS

కొల్లాపూర్ డివిజన్ టిఎన్జీవో సంఘం ఎన్నికలు పూర్తి

Satyam NEWS

Leave a Comment