39.2 C
Hyderabad
April 25, 2024 17: 17 PM
Slider కరీంనగర్

హాక్ ఐ:250 సిసి కెమారాలతో జాతరలో నిరంతర నిఘా

sp rahulhegde aletring hack eye with 250 cc camaras in shivaratri

ప్రముఖ పుణ్య క్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధిలో ఈ నెల 20,21,22 రోజుల్లో జరిగే మహాశివరాత్రి జాతర లో 250 సిసి కెమారాలతో జాతరలో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే తెలిపారు.మంగళవారం సాయంత్రం ఆర్.డి.ఓ శ్రీనివాస్ రావు, ఆలయ ఈవో కృష్ణవేణి వేములవాడ డీఎస్సీ పి చంద్రకాంత్, టౌన్ సి.ఐ శ్రీధర్ తో కలిసి ఆలయ పరిసరాలు,క్యూలైన్లు, పార్కింగ్ స్థలాలు, శివార్చన స్టేజీ తదితర ప్రాంతాలను పరిశీలించారు.

అనంతరం అయన మాట్లాడుతూ జాతర నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని భక్తుల రద్దీని అదుపు చేయడంతోపాటు త్వరత్వరగా భక్తులకు స్వామివారి దర్శనాలు జరిగేలా చొరవ తీసుకోవాలని ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే అన్ని శాఖల అధికారులను కోరారు. వేములవాడ రాజన్న సన్నిధిలో ఈనెల 20నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంపూర్ణ రక్షణ చర్యలుతీసుకుంటున్నట్లు అయన తెలిపారు.

లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం ఆలయం ఆధ్వర్యంలో ఉన్న 129 సీసీ కెమెరాలతోపాటు అదనంగా 111 కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిరంతరం నిఘాపెంచడంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా 6 సెక్టర్ లలో పార్కింగ్ స్థలాలు కేటాయించారు.

రాజన్న సన్నిధికి వచ్చే అన్ని దారులను జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు. వీఐపీల రాక, వారి బందోబస్తుపై చర్చించారు. ఆలయంలో భక్తుల రద్దీని అదుపు చేయడంతోపాటు త్వరత్వరగా భక్తులకు స్వామివారి దర్శనాలు జరిగేలా చొరవ తీసుకుంటున్నామన్నారు.వేములవాడ రాజన్నజాతర విజయవంతానికి అన్నిశాఖల అధికారులు, సిబ్బందితోపాటు స్థానికులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.ఈ రాజేష్ తో పాటు ఆలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కొల్లాపూర్ గాంధీ హై స్కూల్ లో ఘనంగా నవంబర్14

Satyam NEWS

టెన్త్ క్లాస్: తెలంగాణ బాటలో నడిచిన ఆంధ్రప్రదేశ్

Satyam NEWS

జనసేవతోనే జనసేన విజయం సాధించడం ఖాయం

Satyam NEWS

Leave a Comment