కాకినాడ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్న బిందు మాధవ్ ఐపీఎస్ సోమవారం సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న ఎస్పీ బిందు మాధవ్ కు ఆలయ ఈవో బల్ల నీలకంఠం స్వాగతం పలికారు. అనంతరం భీమేశ్వర స్వామిని,బాలా త్రిపురసుందరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నంది మండలం వద్ద వేద స్వస్తి పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో బిందుమాధవ్ కర్నూల్ నుండి కాకినాడకు ఎస్పీకే బదిలీపై వచ్చారు. పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు,సీ. ఐ కృష్ణ భగవాన్,ట్రాపిక్ ఎస్. ఐ అడపా గరగారావుకు పాల్గొన్నారు.
previous post