27.7 C
Hyderabad
April 24, 2024 09: 19 AM
Slider గుంటూరు

స్పందన ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి

#palanadupolice

స్పందన ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారంనాడు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మొత్తం 61 పిర్యాదులు అందగా,ఆ పిర్యాదులలో కుటుంబ, ఆస్తి తగాదాలు, భార్య భర్తల కలహాలు, చీటింగ్ కేసులకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పరిపాలన అత్యంత చేరువులో ఉండాలని, బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్ కు వస్తే వారి పట్ల మర్యాదతో ప్రవర్తించాలని, వారికి మేమున్నామనే భరోసా కల్పించే విధంగా వారి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని పోలీసు అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎస్పి తో పాటు సత్తెనపల్లి డిఎస్పి.ఆర్.విజయభాస్కర్ రెడ్డి, గురజాల డిఎస్పి B.M. జయరాం ప్రసాద్,దిశా డిఎస్పీ U. రవిచంద్ర ఇతర పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్ విడుదల చేసిన సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ స్పార్క్ 1.O ప్రచార చిత్రం

Satyam NEWS

తండ్రి ఆశ‌యం మేర‌కు ద్వాద‌శ జ్యోతిర్లింగాల ప్రతిష్ట

Satyam NEWS

జీ హుజూర్… నీబాంచన్ కాల్మొక్కుతా… ఇంకా… ఇంకా…

Satyam NEWS

Leave a Comment