36.2 C
Hyderabad
April 24, 2024 22: 51 PM
Slider ముఖ్యంశాలు

“స్పందన” లో ఫిర్యాదులు ఎన్నొచ్చాయంటే…

#spandana

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక “స్పందన” కార్యక్రమాన్ని  నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 30 ఫిర్యాదు లను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

మెరకముడిదాం మండలం రాచగుమడంకి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేస్తూ తన మామిడి తోట మీదుగా ఆదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తన అనుమతి లేకుండా నీటి పైపును వేసారని, వారిని ప్రశ్నించగా, తనపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్టపరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని బుదరాయవలస ఎస్ఐని ఆదేశించారు.

రాజాం మండలం గురవంకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన కుమార్తె జూన్ 13 నుంచీ నుండి కనిపించటం లేదని, ఈ విషయమై రాజాం పోలీసులు కేసు నమోదు చేసారని, తన కుమార్తె ఆచూకి త్వరితగతిన కనుగొని తమకు అప్పగించాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ త్వరితగతిన విచారణ జరిపి, అదృశ్యమైన కుమార్తె ఆచూకీ కనుగొని, ఫిర్యాదికి అప్పగించి, న్యాయం చేయాలని రాజాం సీఐని ఆదేశించారు.

గుర్ల మండలం, పున్నపురెడ్డిపేటకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త మరియు ఆతని బంధువులు ఆదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, తనకు భోజనం, తన పాపకి ఆవసరమైన మందులు కూడా ఇవ్వడం లేదని, తనకు న్యాయం చేయాలని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని దిశ డిఎస్పీని ఆదేశించారు.

బొబ్బిలికు చెందిన ఒకామె వేరొక మహిళకు 60 వేలు అప్పుగా ఇచ్చినట్లు, తన డబ్బులను తిరిగి చెల్లించకుండా తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు చెప్పి, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొబ్బిలి సీఐని ఆదేశించారు.

గజపతినగరం మండలం, కొత్తబగ్గాంకి చెందిన కొందరు రైతుల వద్ద, రామభద్రాపురం మండలం భూసాయ వలసకు చెందిన ప్రైవేటు కాటన్ మిల్లు వారు ప్రత్తి కొనుగోలు చేసి డబ్బులు చెల్లించనట్లు, వారి నుండి సదరు రైతులకు రావలసిన సొమ్ము ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొబ్బిలి డిఎస్పీని ఆదేశించారు.

విజయనగరం టూటౌన్ కు చెందిన ఒకామె బొబ్బిలికి చెందిన మరొక వ్యక్తి వద్ద నుండి కారును కొనుగోలు చేసినట్లు, తన భర్త కరోనా కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కారు యొక్క మొదటి యజమాని వచ్చి, తమ వద్ద ఉన్న కారును మారు తాళంతో తీసుకొని వెళ్ళిపోయారని, తమ కారు తమకు తిరిగి ఇప్పించవలసిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం టూటౌన్ సీఐని ఆదేశించారు.

స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే విచారణ చేపట్టి ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు, డీసీఆర్బీ సీఐ డా.బి.వెంకటరావు, ఎస్బీ సీఐలు జి. రాంబాబు, సి.హెచ్. రుద్రశేఖర్, వన్ టౌన్ సీఐ జె. మురళి, ఎస్ఐ వాసుదేవ్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు అస్వస్థత

Satyam NEWS

శ్రీశైలం వద్ద కృష్ణా జలాల్లో విహరించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు

Satyam NEWS

వ్యాయామ ఉపాధ్యాయుడు డా.మోహన్ కు ఉగాది పురస్కారం

Satyam NEWS

Leave a Comment