32.2 C
Hyderabad
April 20, 2024 19: 55 PM
Slider విజయనగరం

పోలీసు స్పందనకు ఫిర్యాదుల వెల్లువ…ఈ సారి 37…!

#spandana

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ  ఎం. దీపిక నిర్వహించారు. సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 37 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

నెల్లిమర్ల మండలం అలుగోలు కి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు శ్రీకాకుళం జిల్లా గార మండలానికి చెందిన వ్యక్తితో 2009లో వివాహం జరిగిందని, ప్రస్తుతం ముగ్గురు పిల్లలు కూడా కలరని, తనను అదనంగా కట్నం తెమ్మనమని భర్త మరియు ఇతర బంధువులు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, ఇరు వర్గాలకు కౌన్సిలింగు నిర్వహించి, ఫిర్యాదికి న్యాయం చేయాలని దిశ సిఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు 2011లో నెల్లిమర్ల మండలం సారిపల్లికి చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని, తనను భర్త మరియు ఇతర బంధువులు అదనంగా కట్నం తీసుకొని రమ్మనమని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ ఇరు కుటుంబాలకు కౌన్సిలింగు నిర్వహించి, ఫిర్యాదికి న్యాయం చేయాలని దిశ సీఐను ఆదేశించారు.

బొబ్బిలి పట్టణంకు చెందిన ఓ బాధితురాలు జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ తన ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు తన వద్ద నుండి డబ్బులు తీసుకొని, ఫైనాన్స్ వ్యాపారులతో కుమ్మక్కై, వేరే వ్యక్తి పేరున టివిఎస్ ఎల్ఎల్ మోటారు సైకిలును మోసగించారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని బొబ్బిలి సీఐను ఆదేశించారు.

ఎస్.కోటకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ తన తండ్రి 2000 ఏడాది లో ఇల్లు కొనుగోలు చేశారని, కానీ, ప్రస్తుతం మా ఇంటి ప్రక్కనున్న వారు ఎటువంటి హక్కులు లేకపోయినప్పటికీ, మా ఇంటి గోడను ఆక్రమించి, మాకు ఇబ్బంది కలిగిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని ఎస్.కోట ఎస్ఐను ఆదేశించారు.

రాజాం మండలం డోలపేటకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి రియల్ ఎస్టేటు వ్యాపారం చేస్తూ, తనకు తెర్లాం మండలం పెరుమాళిలో 1-07 ఎకరాల వ్యవసాయ భూమిని చూపించి, తనకు తప్పుగా రిజిస్ట్రేషను చేయించి, డబ్బులు తీసుకొని, మోసగించారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని రాజాం సీఐను ఆదేశించారు.

విజయనగరం  కొత్తపేటకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు పూల్బాగ్ కాలనీలో గల ఇంటిని ఒక వ్యక్తికి అద్దెకు ఇచ్చినట్లు, సదరు వ్యక్తి తనకు అద్దె చెల్లించడం లేదని, ఖాళీ చేయడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం టూటౌన్ సీఐ లక్ష్మణరావును ఆదేశించారు.ఇలా “స్పందన”లో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ  ఎం.దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డీసీఆర్బీ సిఐ జె. మురళి, ఎస్బీ సిఐలు జి. రాంబాబు, ఈ. నర్సింహమూర్తి ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

భాషా పండితులు పి.ఈ.టి లకు న్యాయం చేయాలి

Bhavani

జిఎస్ టి సమస్యలపై హరీష్ సానుకూల స్పందన

Satyam NEWS

మంత్రి వ్యాఖ్యలపై హేమా మాలిని స్పందన

Sub Editor

Leave a Comment