36.2 C
Hyderabad
April 25, 2024 22: 15 PM
Slider విజయనగరం

ఏక‌ధాటిగా 40 ఫిర్యాదుల‌ను స్వీక‌రించిన విజయనగరం పోలీస్ బాస్

#deepikaips

విజ‌య‌న‌గ‌రం జిల్లాకు మూడో లేడీ ఎస్పీగా గ‌తేడాది బాధ్య‌త‌లు తీసుకున్న దీపిక‌…స్పంద‌న‌పై ఎక్కువ మ‌క్కువ చూపిస్తున్న‌ట్టు …తెలుస్తోంది. అందుకు  ప్ర‌తీసారి లా కాకుండా ఈ సోమ‌వారం జిల్లా  పోలీస్ కార్యాల‌యం ఆవ‌ణ‌లో జ‌రిగిన స్పంద‌న కార్య‌క్ర‌మంలో దాదాపు 40కి పైగా బాధితుల నుంచీ ఫిర్యాదులు స్వీక‌రించారు. ఈసారి స్పంద‌న‌లో జిల్లా  కేంద్ర‌మైన‌ విజ‌య‌న‌గ‌రం నుంచీ అత్య‌థిక మంది బాధితులు…పోలీస్ బాస్ కు త‌మ‌ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో అక్క‌డిక్క‌డే మాట్లాడారు. త‌క్ష‌ణం ఆ స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

వేపాడ కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, తను  స్వంతంగా బ్యాంక్ కస్టమర్ సర్వీసు నడుపుతున్నట్లు, ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ ద్వారా తనకు కొంత డబ్బులు పంపితే వెంటనే వచ్చి ఇచ్చివేస్తానని చెప్పగా తాను సిడిఎం మిషీన్ ద్వారా డబ్బులు పంపి మోస‌పోయాన‌ని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాది పై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్టపరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని వల్లంపూడి ఎస్ఐను అదేశించారు.

ఎస్. కోట కి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ అదే గ్రామానికి చెందిన వేరొకామె తనకు ఆర్ధిక అవసరాలు ఎదురయ్యాయని చెప్పి ఫిర్యాది యొక్క ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు అప్పుగా తీసుకొందని…, ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు, తనఖా పెట్టుకొన్న వ్యక్తి ఇప్పుడు ఫిర్యాదిని డబ్బులు ఇచ్చి తన ఇంటి పత్రాలు తీసుకువెళ్ళమని ఒత్తిడి తెస్తున్నార‌ని.., తన ఇంటి పత్రాలు తనకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని ఎస్.కోట సీఐని ఆదేశించారు.

విజయనగరం బాబామెట్ట, ఖాదర్ నగర్ కు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ తన భర్త, అత్త, మరిది తనను అదనపు కట్నం కోసం వేధించారని, తన భర్త నుండి తనకు, తన 4 ఏళ్ల కొడుకు కి కోర్టువారు మంజూరు చేసిన మనోవర్తిని నెలనెలా తన భర్త ఇవ్వడం లేదని, వారిపై చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ చట్ట పరిధిలో చర్యలు తీసుకొని,ఫిర్యాదికి న్యాయం చేయాలని దిశ పి.ఎస్ డిఎస్పీని ఆదేశించారు.

విజయనగరం ,బాలాజీనగర్ కు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ తను తోటపాలెం లో ఒక ఇంటి స్థలం కొన్నట్లు, సదరు స్థలం కొన్న సమయంలో అమ్మిన వ్యక్తి 30 అడుగుల రోడ్డు ఉందని చెప్పి నిమ్మించి అమ్మినట్లు, ప్రస్తుతం తను సదరు స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టగా రోడ్డు లేదని తెలిసిందని అమ్మిన వ్యక్తికి సదరు విషయం చెప్పి 4 నెల‌లు అవుతున్నా పరిష్కారం చూపడం లేదని, తన సమస్యను పరిష్కరించి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించినజిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం వ‌న్ టౌన్ సిఐను అదేశించారు.

విజయనగరం , దాసన్న పేటకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ తను తన దగ్గర బంధువులకు కొంత డబ్బులు అప్పుగా ఇచ్చినట్లు, ప్రస్తుతం తన డబ్బులు ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా తిరిగి తనను బెదిరిస్తున్నారని, తన డబ్బులు తనకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాది పై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం టూటౌన్ సీఐని ఆదేశించారు.

విజయనగరం  చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ రాజీవ్ నగర్ కాలనీ నందు తనకు ఒక ఇల్లు ఉన్నట్లు, సదరు ఇంటిలో ఒక వ్యక్తి అద్దెకు దిగి అద్దె ఇవ్వకుండా ఇంటిని ఖాళీ చేయమంటే అసభ్యపదజాలంతో దూసిస్తున్నట్లు, తన ఇంటిని ఖాళీ చేయించి, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాది పై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాల్సిందిగా విజయనగరం టూటౌన్ సీఐని ఆదేశించారు.

స్వీకరించిన ఫిర్యాదుల పై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడురోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుల పై తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, డీసీఆర్ బి సీఐ డా.బి.వెంకటరావు, ఎస్బీ సీఐలు ఎన్.శ్రీనివాసరావు, జి.రాంబాబు, డీసీఆర్ బి ఎస్ఐలు మురళి, వి.సూర్యారావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి 50 శాతం తగ్గిస్తున్న సీరం

Sub Editor

Free Trial Zytenz Maximum Strength Male Enhancement Serum Sex Spray How To Use Tantric Love Positions

Bhavani

ఐజ తిరుమల్ రెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

Leave a Comment