37.2 C
Hyderabad
April 19, 2024 11: 03 AM
Slider ముఖ్యంశాలు

మా మొర ఆల‌కించండి…పోలీసు బాబులూ…..!

#vijayanagarampolice

రెక్కాడితో డొక్కాడ‌దు…వాళ్ల‌కు.తండ్రి అవ‌సాన ద‌శ‌లో ఉన్న తండ్రిని అన్నివిధాలచూసుకోవ‌ల‌సిన కొడుకులే ఆ తండ్రి ని కాల‌ద‌న్నారు.ఇక ఉన్నఒక్క‌గానొక్క కూతురిని అత్తారింటికి పంపించినా…భ‌ర్త ,అత్త‌లు త‌న్నిత‌రిమియేడంతో మాకు న్యాయం చేయ‌డంటూ విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలో అదీ పోలీస్ కార్యాల‌యంలో జ‌రుగుతున్న స్పంద‌న‌లో పోలీసులు బాస్ ల‌కు మొర‌పెట్టుకున్నారు….ఓ తండ్రీ,కూతుళ్లు.

ఇలా చాలా మంది బాధితులు…సంబందిత పోలీస్ స్టేష‌న్ ల‌లోఫిర్యాదు చేసిన ఆ స్టేష‌న్ సిబ్బంది ప‌ట్టించుకోక‌పోవ‌డం…స్టేష‌న్ అధికారులు చెప్పింది..బాదితుల‌కు అర్ధం కాక‌పోవ‌డం, అలాగే స‌రైన ఆధారాలు, స్ప‌ష్టత‌గా స్టేషన్ కు వ‌చ్చిన ఫిర్యాదులు ఉండ‌టంతో ఓ ర‌కంగా వాటిని సంబంధిత స్టేష‌న్ అధికారులు ప‌రిష్క‌రించ‌క‌పోవడంతో స‌రాస‌రి నేరుగా జిల్లా పోలీస్ బాస్ ల‌కు ఫిర్యాదు చేసేందుకు బాదితులు డీపీఓకు త‌ర‌లివ‌స్తున్నారు.తాజాగా అడిష‌న్ సూపరెంటెండెంట్ ఆఫ్ పోలీస్(ఏఎస్పీ) స‌త్య‌నారాయ‌ణ‌రావుకు ఫిర్యాదు చేసేందుకు వ‌చ్చారు…జిల్లాలోని బొండ‌ప‌ల్లి కి చెందిన స‌న్యాసినాయుడు…తన కూతురుతో.

త‌న‌కు ఇద్ద‌రు కొడ‌కులున్నా…న‌డ‌వలేని స్థితిలో ఉన్న ప‌ట్టెడు అన్నం పెట్ట‌డం లేద‌ని ఏఎస్పీకి చేతులు  జోడించి మ‌రీ ఫిర్యాదు చేసారు. ఇక  పెద్దాయ‌న గోడు విన్న‌ ఏఎస్పీ..డీసీఆర్బీ సీఐ ద్వారా సంబందిత స్టేష‌న్ సిబ్బందితో మాట్లాడ‌తాన‌ని వృద్దునికి హామీఇచ్చారు. అప్పుడే అక్క‌డే ఉన్న మీడియా ప్ర‌తినిధికి ఆ  తండ్రీ,కూతుళ్లు త‌మ గోడును విన్న‌వించుకున్నారు.గ‌జప‌తి న‌గ‌రం,బొండ‌ప‌ల్లి పోలీసులు త‌మగోడును ప‌ట్టించుకోక‌పోవ‌డంతో…జిల్లా పోలీసు కార్యాల‌యపు మెట్లు ఎక్కాల్సివ‌చ్చింద‌న్నారు.

ఇక్క‌డ త‌మ‌కు న్యాయం  జరుగుతుంద‌ని ఇక్క‌డి పోలీస్ పెద్ద‌లు త‌మ గోడు వింటార‌నే నమ్మ‌కంతో వ‌చ్చామ‌ని తండ్రీ,కూతుళ్లు  చెప్పుకున్నారు.ఆ తండ్రీ,కూతుళ్లు అనుభవిస్తున్న‌స‌మ‌స్య‌ల‌తో పాటు స్పంద‌న‌కు వ‌చ్చిన మిగిలిన బాధితుల స‌మ‌స్య‌ను  ప‌రిష్క‌రించి….స్పంద‌న‌కువ‌స్తే తాము అనుభ‌విస్తున్న‌క‌ష్టాలు తీరుతాయ‌న్న న‌మ్మ‌కం క‌లిగించాల‌ని సత్యం న్యూస్.నెట్ ..పోలీస్ శాఖ‌ను అందునూ ప్ర‌త్యేకించి బాధితుల మొర ఆల‌కిస్తున్న లేడీ ఎస్పీ  దీపికా ని కోరుతోంది.

ఎం.భరత్ కుమార్,సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కు అభినందల మాల

Satyam NEWS

ట్విట్టర్ నుంచి కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు

Satyam NEWS

Interview: ఎఫ్‌ 3తో నవ్వుల వ్యాక్సిన్ గ్యారెంటీ

Satyam NEWS

Leave a Comment