40.2 C
Hyderabad
April 24, 2024 16: 03 PM
Slider విజయనగరం

గతవారం కంటే తగ్గిన స్పందన ఫిర్యాదులు…!

#spandana

ఖాకీ యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరూ పోలీసు కాదు.. తన వద్దకు, అదీ స్టేషన్ వద్దకు వచ్చిన బాధితుడిని, సమస్యను చట్ట పరిధిలో పరిష్కరించిన వారే పోలీస్. సరిగ్గా ఆ కోవలోకే వస్తోంది… విజయనగరం జిల్లా పోలీసు శాఖ. చేతికి లాఠీ పని చెప్పకుండా….పోలీసు స్టేషన్ కు సమస్యలతో బాధితులు రాకుండా చూస్తున్నది ఎవ్వరంటే విజయనగరం జిల్లా పోలీసు బాస్ దీపికా ఎం పాటిల్. అలా చేస్తున్నందునే ఈ వారం పోలీసు స్పందనకు బాధితులు తగ్గారు.

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక, “స్పందన” ను నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

“స్పందన” కార్యక్రమంలో భాగంగా 37 ఫిర్యాదులు

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ అదే ప్రాంతానికి చెందిన కొంత మంది వ్యక్తులు గరివిడిలో రియల్ ఎస్టేటు వ్యాపారం చేస్తున్నామని, తనతో కోటి 80 లక్షలు  పెట్టుబడి పెట్టించి, తిరిగి డబ్బులు చెల్లించడం లేదని, తనను నమ్మించి మోసం చేసారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం మాలని చీపురుపల్లి సిఐను ఆదేశించారు.

పూసపాటిరేగ మండలం సిహెచ్. అగ్రహారంకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు 2015 లో వివాహం అయ్యిందని, ఒక కుమారుడు ఉన్నాడని, అయితే తన భర్త మరియు ఇతర కుటుంబ సభ్యులు తనను అదనంగా కట్నం తెమ్మనమని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్టపరమైన చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని, దిశ మహిళా పిఎస్ సిఐను ఆదేశించారు.

అనారోగ్యం అంటే అప్పిచ్చాను… తిరిగి ఇవ్వాలి కదా?

విజయనగరం మండలం చెల్లూరుకి చెందిన ఒకామె జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేస్తూ, తన గ్రామానికి చెందిన ఒకామెకు అనారోగ్యం కారణంగా చికిత్సకు  5లక్షలు అప్పుగా ఇవ్వగా, తిరిగి చెల్లించడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం రూరల్ ఎస్ఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను విజ్జీ స్టేడియంలో క్రీడా శిక్షకుడిగా పని చేస్తున్నట్లు, కొంతమంది ఆకతాయిలు స్టేడియం పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని, పెట్రోలింగు ఏర్పాటు చేయాల్సిందిగా విజయనగరం టూ టౌన్ సిఐను ఆదేశించారు.

నెల్లిమర్ల కు చెందిన ఒకామె జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేస్తూ, తాను నివసిస్తున్న ప్రాంతానికి చెందిన ఒకామెకు చిట్టీగా నెలకు రూ.5వేలు చొప్పున చెల్లించానని, తిరిగి చిట్టీల డబ్బులను తనకు ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని నెల్లిమర్ల ఎస్ఐను ఆదేశించారు.

నెల్లిమర్ల కి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, తన తాత బ్రతికున్న సమయంలో తన తల్లికి గిఫ్ట్ రూపంలో కొంత నివాస స్థలంను రిజిష్టరు చేసారని, కానీ, ఇప్పుడు తన మేనమామలు సదరు స్ధలంకు విలువ పెరగడంతో స్ధలంను ఆక్రమించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని, దౌర్జన్యానికి పాల్పడు తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని భోగాపురం సిఐను ఆదేశించారు.

ఇలా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను, వెంటనే తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, డిసిఆర్బి సిఐ జె. మురళి, ఎస్బీ సిఐ జి.రాంబాబు, డిసిఆర్బి ఎస్ఐ వాసుదేవ్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

మేడ్చల్ -మల్కాజ్ గిరి జిల్లా నూతన ట్రెసా కార్యవర్గం ఎన్నిక

Satyam NEWS

మత్స్య సంపద పెంపొందించేందుకు ప్రభుత్వ కృషి

Satyam NEWS

పేదలకు ఆహారం పంచి పెట్టిన జనసేన నేతలు

Satyam NEWS

Leave a Comment