24.7 C
Hyderabad
March 29, 2024 05: 37 AM
Slider విజయనగరం

ఫిర్యాదు దారుల  అలసటను గుర్తించిన పోలీసు బాస్…!

#spandana

మండుతున్న ఎండకు… ఏసీ రూమ్ లో బాధితులకై “స్పందన”…!

మీరు చదివిన హెడ్డింగ్ నిజమే… మీరు సరిగ్గానే చదివారు… అదేంటి…ఏసీ కాన్ఫరెన్స్ హాలేంటి… “స్పందన”..ఫిర్యాదులు దారులకేంటని ఆశ్చర్య పోకండి. విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక  నిర్వహించారు.

సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీగారు 34 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

కొత్తవలస మండలం వీరభద్రపురం  కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి…  ఫిర్యాదు చేస్తూ తన గ్రామానికి చెందిన వ్యక్తికి . 2 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు, కానీ సదరు వ్యక్తి డబ్బులను తిరిగి చెల్లించడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని కొత్తవలస సిఐను ఆదేశించారు.

మెరకముడిదాం మండలం పులిగుమ్మి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, తాను స్టాక్ మార్కెట్ లో .9.24 లక్షలు మోసపోయినట్లు, ఈ విషయమై చీపురుపల్లి పోలీసులు కేసు నమోదు చేసారని, తన డబ్బులు తిరిగి ఇప్పించి, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని, చీపురుపల్లి సిఐను ఆదేశించారు.

విజయనగరం వైఎస్ఆర్ నగర్ కు చెందిన ఓ బాధితురాలు…  జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త చెడు వ్యసనాలకు అలవాటు పడి, తనను, పిల్లలను సక్రమంగా చూడడం లేదని, అదనంగా కట్నం తీసుకొని రమ్మనమని వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని దిశ సిఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను . 5 లక్షలు చెల్లించి, ఇల్లు తనఖా తీసుకున్నట్లు, కానీ, సదరు యజమాని తాను తనఖా తీసుకున్న ఇంటి తాళాలు పగులగొట్టి, ఇంటిని ఆక్రమించుకున్నట్లు, తన డబ్బులను తిరిగి ఇప్పించాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం వన్ టౌన్ సిఐను ఆదేశించారు.

విజయనగరం  కు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకో ఫిర్యాదు చేస్తూ తాను బంగారు వస్తువులను కొనుగోలు నిమిత్తం ఒక జ్యూవెలరీ షాపు యజమానికి . 1.23 లక్షలు డిపాజిట్ చేసినట్లు, తనకు బంగారు వస్తువులు గాని, డబ్బులను కాని ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేసి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని వన్ టౌన్ సిఐను ఆదేశించారు.

బొబ్బిలి మండలం పారాదికి చెందిన ఓ బాధితురాలు జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ తన భర్త మరియు ఇతర బంధువులు అదనంగా కట్నం తీసుకొని రమ్మనమని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొబ్బిలి సిఐను ఆదేశించారు.

“స్పందన”లో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ  ఎం. దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, డిసిఆర్బీ సిఐ జె.మురళి, ఎస్బీ సిఐలు జి. రాంబాబు, ఈ. నర్సింహమూర్తి, డిసిఆర్బీ ఎస్ఐ వాసుదేవ్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

నటి శ్రావణి ఆత్మహత్యతో నాకు సంబంధం లేదు

Satyam NEWS

ప్రభుత్వ 108 వాహనాన్ని మంజూరు చేయాలి

Satyam NEWS

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment