37.2 C
Hyderabad
March 29, 2024 20: 43 PM
Slider నెల్లూరు

కావాలి లో ఘనంగా అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం

#sprrowday

కావలి లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ పి జి సెంటర్ కావలి లోని జంతుశాస్త్ర విభాగంలో అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం ను ఎస్ ఎస్ ఎస్ యూనిట్ – 1   ప్రోగ్రామ్ ఆఫీసర్ డా యం. సుశీల, సహాయ ఆచార్యులు మరియు జంతుశాస్త్ర విభాగ అధిపతి డా వి. శైలజ, సహాయ ఆచార్యులు వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా జంతుశాస్త్ర విభాగ అధిపతి డా వి. శైలజ మాట్లాడుతూ  ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రతి సంవత్సరం మార్చి 20 న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకుంటారని  ప్రతి సంవత్సరం ” ఐ లవ్ స్పారోస్ ” అనే థీమ్ ప్రకారం వేడుకలు నిర్వహిస్తారని ఈ థీమ్‌తో ఎక్కువ మంది ప్రజలు పిచ్చుకలను రక్షించ డానికి అనేక అవగాహన సదస్సులు మరియు ప్రచారాలు జరుపుతారని తెలియజేశారు.

అదేవిధంగా ఈ రోజు ప్రాముఖ్యతను తెలియజేస్తూ డా యం.సుశీల ఎన్ ఎస్ ఎస్ యూనిట్-l ప్రోగ్రామ్ ఆఫీసర్ మాట్లాడుతూ మనందరికీ చిన్నప్పటి నుంచి పిచ్చుకలతో ఏదో ఒక ప్రత్యేక బంధం ఉందని, పిచ్చుకలు స్నేహపూర్వక సమూహాలలో నివసించే ప్రవృత్తికి ప్రసిద్ధి చెందాయని, అంతరించిపోయే దశలో ఉన్న ఈ సామాజిక కిలకిలారావాల పక్షులను రక్షించేందుకు ప్రజలు మరియు దేశాల్లో అవగాహన పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 20 న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్తూ, మన పర్యావరణ వ్యవస్థకు పిచ్చుకల విలువపై ప్రజలకు అవగాహనను పెంచడం, సంరక్షణను ప్రోత్సహించడం,పక్షిని రక్షించడానికి, పరిరక్షణ ప్రయత్నాలను బలోపేతం చేయడం మరియు విస్తృతం చేయడం దీని లక్ష్యమని తెలియచేశారు.

అదేవిధంగా జంతుశాస్త్ర అధ్యాపకులు డా పి .సుధాకర్ రెడ్డి గారు  పిచ్చుకలు అంతరించి పోవడానికి గల కారణాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైన్స్ విభాగపు విద్యార్థిని, విద్యార్థులు మరియు ఎన్ ఎస్ ఎస్  వాలంటీర్స్ పాల్గొన్నారు.

Related posts

రామప్ప కు యునెస్కో గుర్తింపు పై సీతక్క హర్షం

Satyam NEWS

బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలి

Satyam NEWS

రామంతపూర్ మహా పడిపూజలో పాల్గొన్న ప్రముఖులు

Satyam NEWS

Leave a Comment