Slider విశాఖపట్నం

జాతీయ రక్షణ నిధికి స్పీకర్ విరాళం

#Ayyannapatrudu

జాతీయ రక్షణ నిధికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేశారు. ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా ఈ విరాళాన్ని ఆయన జమ చేశారు. ఈ సందర్భంగా  స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మన దేశ సాయుధ దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చేస్తున్న ధైర్యసాహసాలు ప్రతి భారతీయునిలో గర్వాన్ని కలిగించే అంశం. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వీర జవాన్లకు నా వంతుగా సంఘీభావంగా నా నెలవేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చాను అని తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనలో సాయుధ దళాలు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తున్నాయి అని అన్నారు.

Related posts

వటపత్రశాయి అలంకారంలో కోదండరాముని కటాక్షం

Satyam NEWS

పలాసలో వైసీపీ దురాగతాలు సాగనివ్వం

Satyam NEWS

104 పథకానికి పేరు మార్చి డబ్బా కొడుతున్నారు

mamatha
error: Content is protected !!