36.2 C
Hyderabad
April 24, 2024 19: 24 PM
Slider గుంటూరు

మహా శివరాత్రి కోసం కోటప్పకొండకు ప్రత్యేక బస్సులు

#APSRTCNarasaraopet

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ లో వేంచేసియున్న శ్రీ  త్రీకోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఏ పీ ఎస్ ఆర్ టి సీ నరసరావుపేట డిపో ప్రత్యేక బస్సులు నడుపుతున్నది.

ఆది వారం ఉదయం 5: 30 గంటల నుండి సాయంత్రం 5:45 గంటల వరకు నరసరావుపేట డిపో నుండి ప్రతి అర గంటకు ప్రత్యేక బస్సులు బయలుదేరుతుందని నరసరావుపేట డిపో మేనేజర్ యస్ కె అబ్దుల్ సలామ్ పత్రికా ప్రకటనలో తెలిపారు.

నరసరావుపేట పట్టణ, పరిసర గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. అలాగే కోటప్పకొండ నుండి నరసరావుపేట కు ఉదయం 6:15గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు బస్సులు ఏర్పాటు చేశారు.

ఈ బస్సులన్నీ బస్టాండు నుండి బయలుదేరతాయని ఆయన తెలిపారు.

Related posts

అపూర్వం పూర్వ విద్యార్ధుల సమ్మేళనం

Satyam NEWS

పోలీస్ అధికారుల బదిలీలు

Bhavani

నడుస్తూ చెత్త ఏరుదాం

Bhavani

Leave a Comment