24.7 C
Hyderabad
March 29, 2024 05: 30 AM
Slider నిజామాబాద్

బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధికి రూ.772 కోట్లు మంజూరు

#pocharam srinivasareddy

తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత బాన్సువాడ నియోజకవర్గానికి కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి మొత్తం రూ.772 కోట్లు నిధులు మంజూరు చేశారని రాష్ట్ర శాసనసభా పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

గురువారం హైదరాబాద్ లోని తన అధికారిక నివాసం నుండి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ద్వారా ఈ విషయం తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని నియోజకవర్గ MLA క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గపు నాయకులతో జరిగిన మీడియా సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ విషయం వెల్లడించారు. బీర్కూరు మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానం అభివృద్ధి పనుల కోసం రూ. 10 కోట్లను మంజూరు చేశారు.

నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ క్రింద రూ. 100 కోట్లు, నియోజకవర్గానికి నూతనంగా మరో 5000 (రూ. 252కోట్లు) డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం కోసం రెండు వందల యాభై రెండు కోట్లు, సిద్దాపూర్ మినీ రిజర్వాయర్ నిర్మాణం కోసం రూ. 76 కోట్లు మంజూరు చేశారు. జాకోర, చందూరు ఎత్తిపోతల నిర్మాణం కోసం రూ.102 కోట్లు, మంజీర నదిపై సుంకిని వద్ద చెక్ డ్యాం నిర్మాణం కోసం. రూ. 30 కోట్లు, కొడిచెర్ల వద్ద చెక్ డ్యాం కోసం రూ. 70 కోట్లు మంజూరు అయ్యాయి.

కొడిచెర్ల లిఫ్ట్ పనుల పూర్తి కోసం మరో రూ. 6.24 కోట్లు మంజూరు చేశారు. హాజీపూర్ చెరువు కాలువల లైనింగ్ కు రూ. 2.73 కోట్లు, నర్సింగ్ కాలేజీ మంజూరుతో పాటు భవనాల నిర్మాణం కోసం రూ. 40 కోట్లు, బాన్సువాడ పురపాలక సంఘం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ. 25 కోట్లు మంజూరు అయ్యాయి.

ఇవే కాకుండా సిద్దాపూర్ రిజర్వాయర్ నుండి కాలువల నిర్మాణం కోసం రూ. 56 కోట్ల మంజూరుకు ప్రతిపాధనలు పంపడం జరిగిందని, త్వరలోనే అనుమతులు వస్తాయి అని అన్నారు. ఈ నిధులతో నియోజకవర్గ పరిధిలో మౌలిక వసతులు పెద్ద ఎత్తున సమకూరుస్తారు.

తక్కువ కాలంలోనే ఇంత పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి తమ తరపున, బాన్సువాడ నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.

జీ.లాలయ్య,  సత్యం న్యూస్ రిపోర్టర్, జుక్కల్

Related posts

నా తెలుగు

Satyam NEWS

నో సెక్యూలర్:ఢిల్లీ ప్రజలు బీజేపీకి బుద్ది చెప్పారు

Satyam NEWS

జర్నలిస్టుగా నువ్వు మాతో ఉండాలి సురేష్

Satyam NEWS

Leave a Comment