32.2 C
Hyderabad
March 28, 2024 22: 49 PM
Slider విజయనగరం

విజయనగరం జిల్లాలో స్పెషల్ డ్రైవ్: సారా అక్రమ రవాణాపై 60 కేసులు

#enforcement

రహదారి ప్రమాదాలు నివారించేందుకు, మద్యం, నాటు సారా, గంజాయి అక్రమ రవాణాను, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై ఉక్కుపాదం మోపేందుకు విజయనగరం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.

ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఎస్ఈబి అదనపు ఎస్పీ ఎన్. శ్రీదేవీ రావు ఆధ్వర్యంలో స్పెషల్ ఎన్ ఫోర్సుమెంటు పోలీసులు మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా సారా అక్రమ తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు.

మద్యం, సారాను అక్రమ రవాణా చేస్తున్న వారిపై 60 కేసులు నమోదు చేసి, 37మందిని అరెస్టు చేసి, వారి నుండి 1312. 6 లీటర్ల నాటు సారాను, 9. 6 లీటర్ల మద్యంను, నాటు సారా తయారీకి వినియోగించే 80 కిలోల నల్ల బెల్లంను స్వాధీనం చేసున్నామన్నారు.

అక్రమ రవాణా చేసేందుకు వినియోగించిన 11 ద్విచక్ర వాహనాలతో పాటు, ఒక వేన్ ను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. అదే విధంగా సారాను తయారు చేసేందుకు వ్యాపారులు భూమిలో ప్రాతిపెట్టిన డ్రమ్ములను వెలికితీసి, వాటిలో నిల్వ చేసిన 22,400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, న్యూసెన్సు చేసే వారిపై 44కేసులు నమోదు చేసామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

Related posts

ఉపాధి హామీ పథకం బకాయిలను వెంటనే చెల్లించాలి

Satyam NEWS

టీ-డయాగ్నోస్టిక్స్‌లో నేటి నుంచి 134 టెస్టులు

Satyam NEWS

ఆంక్షలు… అడ్డంకులు… భీమ్లా నాయక్ ను ఆపగలవా?

Satyam NEWS

Leave a Comment