39.2 C
Hyderabad
April 25, 2024 18: 04 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లాలో గంజాయి, గుట్కా, పేకాటపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి

#wanaparthy

వనపర్తి జిల్లాలో  గంజాయి, గుట్కా, పేకాటపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిర్ములించాలని జోగులాంబ జోన్ డిఐజి   ఎల్. యస్.  చౌహాన్ పోలీసు అధికారులను ఆదేశించారు. సామన్య ప్రజలు పోలీస్టేషన్ వెళితే వారికి సత్వరమే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని చెప్పారు. జోగులాంబ జోన్ డిఐజి ఎల్. యస్.  చౌహాన్  వనపర్తి జిల్లాలో పర్యటించారు. ముందుగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న డిఐజికి వనపర్తి జిల్లా ఇంచార్జ్ ఎస్పీ కె. మనోహర్   పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

అనంతరం జిల్లా సాయుధ దళ పోలీసుల చేత గౌరవ వందనాన్ని స్వీకరించారు. సమావేశ భవనంలో  జిల్లాలోని పోలీసు అధికారులందరితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి వనపర్తి జిల్లాలోని స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న అధికారులతో ఒక్కొక్కరి పనితీరు,వారి విధి విధానాల గురించి చర్చించారు. ఈ నేర సమీక్ష సమావేశంలో  డిఐజి మాట్లాడుతూ దొంగతనాలు, నేరాలు జరుగకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పగలు రాత్రి గట్టి పెట్రొలింగ్ బీట్లు నిర్వహించాలని

బ్లూకోర్ట్స్, పెట్రో మొబైల్ పోలీసు సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ డయల్ 100 ఫిర్యాదులపై  వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకొవాలని  అన్నారు. ఫంక్షనల్ వర్టికల్స్ గురించి వారి  పనితీరు గురించి అడిగి తెలుసుకొని స్టేషన్లోని వివిధ వర్టికల్స్ లో సిబ్బంది పోటీతత్వంతో పనిచేసి మెరుగైన అభివృద్ధి సాధించాలని తెలిపారు. అలాగే కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా సిసి కెమెరాల ఏర్పాటు వేగవంతం చేయాలని తద్వారా నేర నియంత్రణ చేయవచ్చని అన్నారు. నేర‌స్తుల‌ను ప‌ట్టుకోవ‌ట‌మే కాదు. స‌రైన ఆధారాల‌తో నేర‌స్తుల‌కు శిక్ష‌లు ప‌డేలా స‌రైన స‌మ‌యంలో ఛార్జిషీటు దాఖ‌లు చేయాల‌న్నారు. ప్రతి ఫైల్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం సిడి ఫైల్ను పొందుపరచాలని సూచించారు. ప్రోయాక్టివ్ పోలీసింగ్ పై అధికారులు సిబ్బంది దృష్టిసారించాలని సూచించారు

కేసుల దర్యాప్తులో జాప్యం పనికిరాదని, నాణ్యతతో కూడిన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పెండింగ్ ఉన్న కేసుల్లో సిసి నెంబర్లు త్వరగా తీసుకోవాలి సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ గురించి గ్రామాలలో, పట్టణాలలో ప్రజలకు, ప్రజాప్రతినిధులకు యువకులకు గ్రామాల విపిఓలు, పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని  సూచించారు. సమీక్షా సమావేశంలో వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ, షాకీర్ హుస్సేన్, వనపర్తి డిఎస్పీ ఆనంద్ రెడ్డి , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసచారి, కొత్తకోట సీఐ, శ్రీనివాస్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, జగన్, వెంకట్, వనపర్తి జిల్లాలోని ఎస్సైలు, డీసీఆర్బీ, సిబ్బంది, ఐటీ సెల్, సిబ్బంది ఉన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

త్రిపుల్ రైడింగ్ పై కేసులు: హెల్మెట్ లేకపోతే ఫైన్: విజయనగరం ఎస్పీ ఆదేశాలు

Satyam NEWS

గ్రేట్ హానర్: రిపబ్లిక్ డే సందర్భంగా పోలీస్ పురస్కారాలు

Satyam NEWS

ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌కు కార్పొరేష‌న్ ప్ర‌జ‌లు నీరాజ‌నాలు…!!

Satyam NEWS

1 comment

POLISHETTI BAALAKRISHNA February 10, 2023 at 7:59 PM

Thank you sir

Reply

Leave a Comment