28.7 C
Hyderabad
April 20, 2024 05: 23 AM
Slider విజయనగరం

విజయనగరం జిల్లాలో బాల్య వివాహాల పై ప్రత్యేక డ్రైవ్

#suryakumariias

బాల్య వివాహలు , మహిళల పై దాడులు,  అక్రమ తరలింపు తదితర అంశాల పై ఎలాంటి సంఘటనలు జరగక  ముందే అవగాహన కలిగించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. బాల్య వివాహాలపై అవగాహన కలిగించడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అన్నారు.  

దిశ పోలీస్ స్టేషన్ వద్ద నున్న వన్ స్టాప్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ కేంద్రం లో ఎన్ని కేసు లు,  ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి, ఏ విధంగా పరిష్కరిస్తున్నారనే అంశంపై వివరాలను అడిగారు.  దిశ యాప్ ను   ఎంత మంది డౌన్ లోడ్ చెకున్నది వివరాలు అడిగారు. దిశ సేవల పై సంతృప్తిని వ్యక్తం చేశారు. 

అనంతరం గంట్యాడ మండలం నరవ గ్రామం లో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రం లో వై.ఎస్.ఆర్ సంపూర్ణ పోషన్ యాప్ లో డేటా నమోదు పై జరుగుతున్న శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నీతీ ఆయోగ్ లో పిల్లల పెరుగుదల పర్యవేక్షణ ఒక సూచీ గా  ఉన్నందున దీని పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు ఉండాలన్నారు. తక్కువ బరువు గల  వారిని అండర్ వెయిట్ కాలం లో ప్రత్యేకంగా నమోదు చేయాలన్నారు.  మాన్యువల్ గా కాకుండా  యాప్ లో డేటా నమోదు తప్పనిసరిగా చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో  ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వరి, సి.డి.పి.ఓ లు , అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

5 నెలల తర్వాత జైలు నుంచి చింతమనేని విడుదల

Satyam NEWS

వనపర్తి నాలుగవ వార్డులో మంచినీటి సమస్యను పరిష్కరించాలి

Bhavani

అక్సిడెంట్:వాహనం ఢీఇద్దరు మహిళలు మృతి

Satyam NEWS

Leave a Comment