32.2 C
Hyderabad
March 28, 2024 22: 57 PM
Slider మహబూబ్ నగర్

చిన్న పిల్లలు మోటారు వాహనాలు నడిపితే కఠిన చర్యలు

#WanaparthyCI

శనివారం రోజు జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లలో  వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు ఆదేశాల మేరకు

వనపర్తి సీఐ సూర్యనాయక్, వనపర్తి  పట్టణఎస్సై వెంకటేష్ గౌడు, వనపర్తి రూరల్ ఎస్సై షేక్ షఫీ  పట్టణ పోలీస్టేషన్ పరిధిలో  రాజీవ్ చౌరస్తా, వివేకానంద చౌరస్తా, వివిధ రహదారులపై ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించే వాహనాల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా  వనపర్తి పట్టణ,వనపర్తి రూరల్  పోలీస్టేషన్ల పరిధిలోని ముఖ్యకూడల్లో మొత్తం 44 వాహనాల గుర్తించారు. ఆ వాహనాలను వనపర్తి పట్టణ పోలీస్టేషన్ కు  తరలించి జరిమానాలు విధించి పెండింగ్ ఈ-చాలాన జరిమానాలు కట్టించారు.

తర్వాత వాహనాలను నడుపుతున్న మైనర్ ల తల్లిదండ్రులను పిలిపించి అవగాహన కల్పించారు. అదేవిధంగా వాహన దారులు  ట్రాఫిక్ నియమాలను పాటించకుండా మైనర్లు, త్రిబుల్ రైడింగ్ చేస్తూ వాహనాలు నడుపుతూ పోలీసులు విధిస్తున్న ఈ- చాలానాల బారి తప్పించుకునే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. అలాంటివారిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకొని వాహనాలను సీజ్ చేస్తామని సీఐ హెచ్చరించారు.

ఈ సందర్భంగా  వనపర్తి సిఐ సూర్యనాయక్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు ఆదేశాల మేరకు  వనపర్తి పట్టణంలో వాహనాలు వేగంగా నడుపుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నందున మైనరు డ్రైవింగ్ వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని తెలిపారు.

మైనర్ వాహనదారులు త్రిబుల్ డ్రైవింగ్  అతివేగంగా  డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాటిని నివారించడానికి అవగాహన  కల్పించామని తెలిపారు. వాహనదారులలో, డ్రైవర్ల లో మార్పు తీసుకువస్తామని తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చని ఆయన అన్నారు.

ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడిపి సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి సీఐ సూర్యనాయక్, వనపర్తి పట్టణ ఎస్సై వెంకటేష్ గౌడు, వనపర్తి రూరల్ ఎస్సై  షేక్ షఫీ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

మహాశివరాత్రి ప్రత్యేకం….. శివ పూజకు మార్గాలెన్నో…

Satyam NEWS

ఐపీఎల్ పోటీలోకి మ‌రో బాలీవుడ్ జంట ఎంట్రీ..

Sub Editor

చంద్రబాబును విమర్శించే స్థాయి ఎమ్మెల్యే మేడా కు లేదు

Satyam NEWS

Leave a Comment