37.2 C
Hyderabad
April 18, 2024 19: 44 PM
Slider ముఖ్యంశాలు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై పోలీసుల ప్రత్యేక నజర్

#DIGRanganath

ఎన్నికల ప్రచారపర్వంలో అనుమతులు తీసుకోకుండా వాహనాలను వినియోగిస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు వినియోగించే వాహనాల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదని అయితే ప్రచారానికి వినియోగించే అన్ని వాహనాలకు విధిగా రిటర్నింగ్ అధికారి ద్వారా అనుమతి పొంది ఉండాలని సూచించారు.

ఒక అభ్యర్థి పేరున అనుమతి పొందిన వాహనాన్ని ఇతర అభ్యర్థులు వినియోగిస్తున్నట్లుగా గుర్తిస్తే అనుమతి రద్దు చేయడంతో పాటు ఆ వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇక కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రచారపర్వంలో పాల్గొనే క్రమంలో కోవిడ్ మార్గదర్శకాలు విధిగా పాటించాలని నిబంధనల ప్రకారం కాన్వాయిలో భద్రతా సిబ్బంది వాహనాలు కాకుండా కేవలం అయిదు వాహనాలను మాత్రమే అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

మిగిలిన వాహనాలు కాన్వాయికు 100 మీటర్ల దూరం పాటిస్తూ ఉండేలా చూసుకోవాలని ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. అదే సమయంలో ఒకే సందర్భంలో రెండు కాన్వాయిలు ప్రచార పర్వంలో పాల్గొనే క్రమంలో కనీసం 30 నిమిషాల వ్యవదితో ఒక్క కాన్వాయికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.

కాన్వాయిలో అధికారిక వాహనాలు మినహా మిగిలిన వాహనాలు సైతం అనుమతి తీసుకోవాలన్నారు. ప్రచారంలో వినియోగిస్తున్న వాహనాల వివరాలను సమగ్రంగా రిటర్నింగ్ అధికారితో జిల్లా ఎన్నికల అధికారికి తెలియపర్చాలని సూచించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పట్ల ఎప్పటికప్పుడు నిఘా పెట్టడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద కేసులు నమోదు చేస్తామని డిఐజి రంగనాధ్ తెలిపారు.

Related posts

నాలా పనులను పరిశీలించిన మంత్రి తలసాని

Bhavani

పాన్ ఇండియా చిత్రం ‘లాఠీ’ ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల

Satyam NEWS

ఈటలకు బ్రహ్మరథం పట్టిన హుజురాబాద్ ప్రజలు

Satyam NEWS

Leave a Comment