32.2 C
Hyderabad
March 28, 2024 23: 21 PM
Slider ప్రత్యేకం

సిరిమానోత్సవానికి మూడంచెల పోలీసు భద్రత: ఎస్పీ దీపిక

#deepikaips

విజయనగరంలో ఈ నెల 18, 19 తేదీల్లో జరగబోవు శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవానికి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు. సిరిమానోత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు బందోబస్తును 20 సెక్టార్లుగా విభజించి, సుమారు 2,500 మంది పోలీసులను రెండు షిఫ్టులుగా విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

బందోబస్తులో ఇద్దరు అదనపు ఎస్పీలు, 11మంది డీఎస్పీలు, 55మంది సీఐలు,ఆర్ ఐలు, 136మంది ఎస్ఐ లు,ఆర్ఎస్ఐలు, 414మంది ఎఎస్ ఐలు లు /హెచ్ సిలు, 652మంది కానిస్టేబుళ్ళు, 144మంది మహిళా కానిస్టేబుళ్ళు, 365మంది హోంగార్డులు, 105మంది ఎస్టీఎఫ్ పోలీసు సిబ్బందిని, 155మంది ఆర్మ్డ్ రిజర్వు పోలీసు, 25మంది పిఎస్ఓలను, 10మందితో బాంబ్ డిస్పోజల్ బృందాలు, 25మంది కమ్యూనికేషన్ సిబ్బందితో సహా సుమారు 2,500మంది పోలీసు అధికారులను, సిబ్బందిని బందోబస్తు నిమిత్తం వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

మొత్తం బందోబస్తును పర్యవేక్షించేందుకు పార్వతీపురం ఓఎస్డీ ఎన్. సూర్యచంద్రరావును నియమించామన్నారు. అదనపు ఎస్పీ (పరిపాలన) పి. సత్యన్నారాయణరావును కమాండ్కం ట్రోల్ రూం పర్యవేక్షణకు నియమించామన్నారు. ఒక్కో తరహా బందోబస్తు పర్యవేక్షణకు ఒక పోలీసు ఉన్నతాధికారిని నియమించినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. అమ్మవారి సిరిమానోత్సవ బందోబస్తు విధులను నిర్వహించేందుకు విశాఖ పట్నం సిటీ, విశాఖపట్నం రూరల్, శ్రీకాకుళం జిల్లాల నుండి కూడా పోలీసు అధికారులు, సిబ్బంది వస్తున్నారని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

19న దర్శనాల నిలిపివేత:

19తేదీన ఉదయం 11గంటల నుండి సిరిమానోత్సవం ముగిసే వరకు శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయంలో దర్శనాలను నిలిపివేస్తున్నందున, భక్తులు ఎవ్వరూ ఆ సమయంలో దర్శనాల కోసం ప్రధాన దేవాలయంకు రావద్దని ప్రజలకు జిల్లా ఎస్పీ సూచించారు.

చెక్ పోస్టుల ఏర్పాటు:

కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి దృష్ట్యా అంతర రాష్ట్ర, అంతర జిల్లా సరిహద్దుల్లోను, అంతర మండలాల్లోను చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, తనిఖీలు చేపట్టి, వాహనాల రాకపోకలను నియంత్రిస్తామన్నారు. శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవం రోజున ఎటువంటి వాహనాలను విజయనగరం నగరం లోకి అనుమతించబోమన్నారు. విజయనగరంలోకి ప్రవేశించే ముఖ్య మార్గాల్లోని బొండపల్లి, గుర్ల, నెల్లిమర్ల, డెంకాడ, విటి అగ్రహారం, గంట్యాడ, జమ్ము ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, వాహన తనిఖీలు చేపట్టి, ఇతర ప్రాంతాల నుండి సిరిమానోత్సవంకు వచ్చే వాహనాలను తిరిగి పంపేస్తామన్నారు.

కమాండ్ కంట్రోల్ రూం శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి దేవాలయం ఎదురుగా తాత్కాలికంగా కమాండ్ కంట్రోల్రూం ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిరిమాను తిరిగే ప్రాంతాలను, సిరిమాను తీసుకొని వచ్చే మార్గంలోను, ఇతర ముఖ్య కూడళ్ళలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అదే విధంగా బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందికి కూడా బాడీ వార్న్ కెమెరాలను ధరింపజేస్తున్నామన్నారు. భద్రతను నిరంతరం పర్యవేక్షించే విధంగా డ్రోన్కె మెరాలు కూడా వినియోగిస్తున్నామన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన పెద్ద టీవిలకు బందోబస్తు లో పోలీసులు ధరించిన బాడీ వార్న్ కెమెరాలను, సిసి కెమెరాలను మరియు డ్రోన్ కెమెరాలను అనుసంధానం చేసి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేసి, భద్రతను పర్యవేక్షిస్తామన్నారు.

ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫాల్కన్ మొబైల్ రాండ్ కంట్రోల్ వాహనంను కూడా వినియోగిస్తు న్నామన్నారు. ఈ వాహనంలో 10 హై రిజల్యూషన్ కెమెరాలు ఉంటాయని, ఈ కెమెరాలు 1.5 కి.మీ.ల విస్తీర్ణం వరకు నిఘా పెడుతూ, పాత నేరస్థులు, అనుమానస్పద వ్యక్తులను గుర్తిస్తూ, దగ్గరలో ఉన్న పోలీసు స్టేషనుకు సమాచారం అందిస్తుందన్నారు.

రూఫ్ టాప్ ల ఏర్పాటు:

సిరిమాను తిరిగే మార్గంలో ముందుగా గుర్తించిన 20 ప్రాంతాల్లో రూఫ్ టాప్ లో పోలీసులను నియమించి, నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక్కడ విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది బైనాక్యులర్స్ తో సిరిమాను తిరిగే ప్రాంతాలను పరిశీలిస్తూ, అవసరమైన సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ రూంకు తెలియజేసి, పోలీసులను అప్రమత్తం చేస్తారన్నారు.

నేరాల నియంత్రణకు ప్రత్యేక క్రైమ్ బృందాలు:

నేరాలను నియంత్రించేందుకు నేరస్థులను గుర్తించుటలో అనుభవజ్ఞులైన 200మంది క్రైం సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసామన్నారు. ఈ బృందాలు ఆలయం, రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో తిరుగుతూ జేబు దొంగతనాలు, గొలుసు దొంగతనాలు జరగకుండా చర్యలు చేపడతారన్నారు.

బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు:

అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించేందుకు పోలీసు జాగిలాలతోపాటు, ప్రత్యేక బాంబ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపుతున్నామన్నారు. ఈ బృందాలు ఆలయాలు, బస్టాండు, రైల్వే స్టేషను మరియు ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపడతారు.

సిద్ధంగా మరో ఏడు ప్రత్యేక బృందాలు:

అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేందుకుగాను ఏడు ప్రత్యేక పోలీసు బృందాలను కమాండ్ కంట్రోల్ వద్ద సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. ఈ సిబ్బంది ఎక్కడ ఏ అత్యవసర పరిస్థితి ఎదురైనా, వేరే పోలీసు సిబ్బంది కోసం వేచి చూడకుండా వీరిని వినియోగిస్తామన్నారు.

వాహనాల పార్కింగు ప్రాంతాలు:

ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని, అధికారులను కేటాయించి, నగరంలో  ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు చేపడతామన్నారు. వాహనాల పార్కింగ్ కు అయోధ్య మైదానం, రాజీవ్ స్టేడియం, రామానాయుడు రోడ్డు ప్రాంతాల్లో ప్రజలు వాహనాలను పార్కింగు చేసుకొనేందుకు స్థలాలను ఏర్పాటు చేసామన్నారు. అదే విధంగా వీఐపీల వాహనాల పార్క్ంగుకు బొంకుల దిబ్బ, కోట ప్రాంతాల్లో రెండు పార్కింగు స్థలాలను ఏర్పాటు చేసామన్నారు. ప్రజలకు సూచనలు చేసేందుకు, సమాచారాన్ని అందించేందుకు వాహనాలకు పబ్లిక్ ఆడ్రసింగు సిస్టమ్స్ ను ఏర్పాటు చేసామన్నారు.

సిరిమానోత్సవం రోజున  విజయనగరం నగర లోపల ప్రాంతాల్లో డ్రైవర్షన్స్:

నగరంలోని వాహనాలను ఎత్తు బ్రిడ్జి, సిఎంఆర్ జంక్షన్, గూడ్సు షెడ్ మీదుగా పట్టణం బయటకు తరలిస్తా మన్నారు. బాలాజీ జంక్షన్, రామానాయుడు రోడ్డు, సీఎంఆర్ జంక్షన్, గూడ్సు షెడ్ మీదుగా పట్టణం వెలుపలకు పంపుతామున్నారు.ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, బాలాజీ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఎత్తుబ్రిడ్జి మీదుగా నగరం వెలుపులకు పంపుతామన్నారు.కొత్తపేట జంక్షన్, దాసన్న పేట, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, ధర్మపురి రోడ్డు మీదుగా పట్టణం వెలుపులకు వెళ్లేందుకు వాహనాలను అనుమతిస్తామన్నారు.

జె.ఎన్.టి.యూ. , కలెక్టరాఫీసు, ఆర్ అండ్ బి జంక్షన్, ఎత్తు బ్రిడ్జ్, ప్రదీప్ నగర్ మీదుగా పట్టణం వెలుపులకు వాహనాలను పంపుతామన్నారు.ప్రదీప్ నగర్ జంక్షన్, ధర్మపురి రోడ్డు, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, దాసన్న పేట మీదుగా బయటకు పంపుతామన్నారు.

నగరం లో పలు ప్రాంతాల్లో బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకొనేందుకు 200 వైర్ లెస్ సెట్లను వినియోగిస్తున్నామన్నారు. అదే విధంగా ప్రజలకు సూచనలు చేసేందుకు అన్ని ముఖ్య కూడళ్ళలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ లను కూడా ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. భక్తులకు సహాయ, సహకారాలు అందించేందుకు పోలీసు సేవాదళ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.

కరోనా బారిన కాకుండా ఉండేందుకు ప్రజలెవ్వరూ సిరిమానోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొనవద్దని, నగరం లో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ఎల్ ఈడి స్క్రీన్స్ ల్లోను, టివిల్లో వచ్చే ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు. ప్రజలందరూ ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని పోలీసుశాఖకు ఇతర శాఖలకు సహకరించాల్సిందిగా ప్రజలకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక విజ్ఞప్తి చేసారు.

Related posts

ఎరువుల కోసం రైతు భరోసా కేంద్రాల వద్ద బారులు తీరిన రైతన్న

Satyam NEWS

అర్ధ రాత్రి అయినా కొనసాగుతున్న అమరావతి రైతు ధర్నా

Satyam NEWS

అడిగే వాడే లేడు: శ్రీకాకుళం జిల్లాలో పురాతన దేవాలయాల కూల్చివేత….

Satyam NEWS

Leave a Comment