30.7 C
Hyderabad
April 17, 2024 01: 32 AM
Slider మహబూబ్ నగర్

మాజీ మంత్రి జూపల్లి ఆరోగ్యం కోసం కొల్లాపూర్ లో పూజలు

#Jupally

కరోనా బారిన పడిన మాజీ మంత్రి, సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు జూపల్లి కృష్ణారావు త్వరగా కోలుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రజలు కోరుకుంటున్నారు.

ఈ మేరకు ఆయన కోసం ప్రార్ధనలు చేస్తున్నారు. నేడు కొల్లాపూర్ పట్టణం లోని రామమందిరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు టీఆర్ఎస్ నాయకులు, కొల్లాపూర్ మున్సిపాల్టీ  19 వార్డు ఇంచార్జ్ బీమ్ శెట్టి దిలీప్ కుమార్ తెలిపారు.

కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 20 సంవత్సరాలు  పాటుపడిన మాజీ మంత్రిజూపల్లి కృష్ణ రావు కరోనా వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

నేడు కొల్లాపూర్ పట్టణం లోని రామమందిరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

టీఆర్ఎస్ నాయకులు జూపల్లి కృష్ణారావు అభిమానులు పెద్ద ఎత్తున పూజ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

పోలీస్ స్పంద‌న‌కు త‌గ్గుతున్న ఫిర్యాదు దారులు….!

Satyam NEWS

జై కొడితేనే బతకాలి, కొట్టకపోతే చావాలా?

Satyam NEWS

Leave a Comment