30.7 C
Hyderabad
April 24, 2024 02: 44 AM
Slider శ్రీకాకుళం

ఘనంగా సంతోషి మాత అమ్మవారి కి పూజలు

#SantoshiMaata

ఎంతో ప్రసిద్ధి చెందిన ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు కోటి వరాల తల్లి భక్తులు పాలిట కల్ప వల్లి శ్రీకాకుళం శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానం లో మార్గశిర మాసం  ముక్కొటి  ఏకాదశి పర్వ దినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారికి తెల్లవారు జామున సుప్రభాత సేవ, మహాక్షిరాభిషేకం సేవ,  నిత్య పూజలు,  సహస్త్రనామార్చనా పూజ సేవ,  కుంకుమ పూజ, శ్రీ లలిత సహస్త్రనామ పారాయణం,   లక్ష కుంకుమార్చన పూజ   వేద పారాయణం,   మహా నివేదన ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి.

భక్తులు ఉదయం నుండి కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు మాస్క్ ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు.

మొక్కులు ఉన్న వారు అమ్మవారి ఉద్యాపనలు జరిపించుకున్నారు. కార్యనిర్వహణాధికారి వాకచర్ల రాధాకృష్ణ అమ్మవారిని దర్శించుకున్నారు.

Related posts

లక్నవరం సరస్సుకు అంతర్జాతీయ ఖ్యాతి తేవాలి

Satyam NEWS

శ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయ గోపుర నిర్మాణానికి శంకుస్థాపన

Satyam NEWS

గుడ్ ప్లాన్: కరోనా సమయంలోనూ రైతు సంక్షేమం

Satyam NEWS

Leave a Comment