వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలోని కమలానగర్ కాప్రా సర్కిల్ ఆపీస్ సమీపంలో భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడకి ఘనంగా పూజలు నిర్వహించారు.
కమలానగర్ మాజీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంటయ్యగౌడ్ , బీజేపీ సీనియర్‌నాయకులు చరచ్చంద్ర, ఉజ్వలప్రసాదరావు, గుంటూరు జయప్రసాద్, చేతన సింగ్, ఎస్‌ఐ అశోక్, ప్రేమకుమార్, బిట్టుగౌడ్, రాజేష్‌యాదవ్ లు ముఖ్యఅతిధులుగా పాల్గొని గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజలో పాల్గొన్న నాయకులను భజరంగ్ యూత్ అసోసియేషన్ నిర్వాహకులు శాలువాతో సన్మానించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమమును ప్రారంభించారు. భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అన్న ప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు అరుణ్‌కుమార్, మహేశ్వర్, సాయికుమార్, బాలగణేష్, శివ, శివానంద్, బిఎల్‌ఆర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.