ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మ వారి కోవెలలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రత్యేక పూజలు చేసారు. రాష్ట్ర ఐటీ శాక మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్బంగా జిల్లా టీడీపీ శ్రేణులంతా నగరంలోని మూడు లాంతర్లు వద్ద ఉన్న చదురగుడి పైడితల్లి అమ్మవారి దేవాలయం లో మంత్రి లోకేష్ పేరుతో పూజలు చేయించారు. ఈ సందర్బంగా ఎంపీ కలిశెట్టి మాట్లాడుతూ రాష్ట్రానికి మంత్రి లోకేష్ సేవలు మరింత అవసరమన్నారు. ప ఒకటి కాదు, పది కాదు ముప్పై ఏళ్లు రాష్ట్రానికి లోకేష్ సేవలు అవసరం, ఉండాలని కోరుతూ దేవాలయం లో పూజలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నేత ఐవీపీ రాజు, నగర అధ్యక్షుడు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, ఆల్తి బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు
