Slider సంపాదకీయం

ఆ మహానుభావుడు జగనే….

#jagan

మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేసేవారిపట్ల ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం రావాలని చాలా మంది భావిస్తున్నారు. అయితే అలాంటి చర్యలు ఏవీ ఇప్పటి వరకూ కనిపించడం లేదు. వై ఎస్ జగన్ సన్నిహితుడు, వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపి, నగ్న వీడియో కాల్ తో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి గోరంట్ల మాధవ్. అతడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను తాజాగా అతి నీచంగా సంబోధిస్తూ మాట్లాడాడు. గోరంట్ల మాధవ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే నారా లోకేష్ ను తిట్టినందుకు కాదు. ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు జగన్ భార్యను అవమానించినందుకు. పోలీసుల బట్టలు ఊడదీస్తా.. అనే జగన్ మాటల తూటా తెలుగుదేశం సానుభూతిపరుడు చేబ్రోలు కిరణ్ లో ఆవేశాన్ని కలిగించింది. పోలీసు వ్యవస్థ మీద తిరగబడితే గతంలో నక్సలిజం అనే వారు. టెర్రరిస్టు క్రింద ఎన్ కౌంటర్ వరకు వెళ్లేది. అవి అడవుల్లో జరిగేది. ఇప్పుడు రాజకీయ ముసుగులో జనం మధ్య మీడియా ద్వారా మాట్లాడుతున్నారు.

అధికారంలో లేని వారికి కోర్టులు వున్నాయి. చట్టపరంగా కదా వెళ్లాలి. పోలీసుల బట్టలు ఊడదీయడం రాజకీయ హక్కుగా.. దాని కోసం అధికారం ఇవ్వమంటూ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ఆమోదం ఇవ్వాలి అని జగన్ కోరినట్లుగా కనిపిస్తున్నది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థనే బెదిరిస్తుంటే ఏం చేయాలి? పోలీసు వ్యవస్థ జగన్ హెచ్చరికలపై బాధను వ్యక్తం చేసింది. మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు సంఘం ఖండించింది. ఎసై తమ యూనిఫామ్  జగన్ వలన రాలేదు అని ఆక్రోశించారు.

కానీ పోలీసులకు జగన్ క్షమాపణలు చెప్పలేదు. అంతకు మించి ఎవరూ ముందుడుగు వేయలేదు. జగన్ బెదిరింపు ధోరణిపై అసహనం వ్యక్తం చేస్తూ కిరణ్ కామెంట్లు చేశాడు. మాట్లాడకూడని మాటలు మాట్లాడినట్లు కిరణ్ వెంటనే తెలుసుకున్నాడు. జగన్ సతీమణి భారతి కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాడు. ఇంకెప్పుడూ మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడను అని చెంపలు వేసుకున్నాడు. తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు.

అయినా ప్రభుత్వం కనికరించలేదు. చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందేనని నిర్ణయించి కిరణ్ ను అరెస్టు చేయించింది. మంత్రి నారా లోకేష్ ను అతి హేయమైన భాషలో తిట్టిన గోరంట్ల మాధవ్ అదే ఊపుతూ వచ్చి పోలీసు కస్టడీ లో ఉన్న కిరణ్ పై హత్యాయత్నం చేశాడు. ఆశ్చర్యంగా.. కిరణ్ క్షమాపణలు చెప్పినా కూడా 24 గంటల్లో అరెస్ట్ చెయ్యకపోతే తాము కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను దూషిస్తాం, తరువాత క్షమాపణలు చెబుతాం అని వైకాపా కారకర్తల సోషల్మీడియాలలో డిమాండ్ చేశారు.

ఇక్కడ భారతి రెడ్డి మీద వారికి సానుభూతి కంటే కిరణ్ మీద పగ తీర్చుకోవడానికి కనిపించిన తాపత్రయం ఎక్కువ కనిపించింది. అలాగే గోరంట్ల మాధవ్ హత్యాయత్నం చేయడం కూడా ఇలానే చూడవచ్చు. దానితో పాటు చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి వెనక్కి తగ్గితే రాజకీయంగా ఇరికించాలన్న ఆత్రుత కనిపించింది. వైసీపీ అతి ముఖ్య నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుండి ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వరకు వైకాపా నాయకుల లెక్కన పొరుగు రాష్ట్రాలలో దాక్కోకుండా.. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించకుండా.. కిరణ్ రాష్ట్రంలోకి వచ్చి పోలీసుల చేత అరెస్ట్ కాబడ్డాడు.

పోలీసుల బట్టల మీద జగన్ చేసిన వాఖ్యలతో మాటతూలిన కిరణ్ చివరికి అదే పోలీసులతో కఠినమైన వ్యవస్థీకృత సెక్షన్ ద్వారా కేసు నమోదు అయ్యి అరెస్ట్ అవ్వడం వైచిత్రి. గత వైకాపా హయాంలో కిరణ్ కంటే ఘోరంగా వైకాపా సోషల్మీడియా కార్యకర్తల నుండి జగన్ తన చెల్లి చీరమీద మాట్లాడిన మాటల వరకు ఒక్క సారిగా పెట్టి వీరిని కూడా అరెస్ట్ చేసే దమ్ముందా అని టిడిపి అభిమాన సోషల్మీడియా కార్యకర్తలు ఆక్రోశించారు. కిరణ్ పైన పెట్టిన సెక్షన్ గురించి ప్రశ్నించారు. కిరణ్ కుటుంబ పేదరికాన్ని చూసి చలించి సాయం చేశారు.

కిరణ్ ను అరెస్ట్ చేసి తీసుకుని వెళుతుంటే.. గతంలో పనిచేసిన అనుభవం, సహకారంతో సమాచారం తెలుసుకొని వెంబడించి దాడికి ప్రయత్నించి మాజీ పోలీసు అధికారిగా గోరంట్ల మాధవ్ అరెస్ట్ అవ్వడం ఆశ్చర్యం కలిగించింది. కిరణ్ కేసులోని సెక్షన్ మీద గట్టిగా వాదనలు వినిపించి జడ్జీ ద్వారా సదరు పోలీసు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చెయ్యడంలో విజయం సాధించి, రిమాండ్ విషయంలో ఓటమి చెందారు కిరణ్ లాయర్లు.

ఇక గోరంట్ల మాధవ్ విషయంలో వాదనలలో చూపించిన సాక్ష్యాల వలన, స్వయంగా మాజీ ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి పాల్గొన్నా రిమాండ్ విషయంలో ఓటమి చెందారు. అయినా ప్రెస్మీట్ పెట్టి బయట ఆ అరెస్ట్ సరైంది కాదు అని పొన్నవోలు వాదించడం చూసి ప్రజలు నవ్వుకొన్నారు. ఏంకర్, బెట్టింగ్ ఆప్ కేసుల్లో హాజరవుతూ బిజీగా వుండే శ్యామల, పార్ట్ టైం వైకాపా అధికార ప్రతినిధిగా మా ఫ్యాన్ గాలి దెబ్బ ఇలా వుంటుంది, గంటల్లో అరెస్ట్ అయ్యాడు కిరణ్ అని ముందే కూసిన కోయిల లెక్కన సంబరపడింది.

ప్రభుత్వ అధినేతగా ఈ పరీక్షలో ప్రజల ముందు నాయకుడుగా చంద్రబాబు తన నిబద్ధతను నిరూపించుకున్నాడు. అటు పోలీసులపై బట్టలు విప్పుతా అనే తన తాజా మాటలు, ఇటు గత తమ బూతు వాఖ్యలు వైకాపాను, జగన్ ను మరోసారి ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ హోరాహోరీ చర్చ రచ్చ ప్రజలు గమనించారు. ఇది అంతిమ జయాపజయాలు కావు. 2029 కోసం కొనసాగాల్సిన రేస్. మధ్యలో పార్టీల వనరులను ఎవరు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తారో వారికి లక్ష్యం చేరువ అవ్వడం కష్టం అవుతుంది. బూతులే తమ బలం అని వైకాపాకు తెలుసు.

లేదంటే వాదించడానికి ఏమీ వుండదు, ఎవరూ పట్టించుకోరు అని అధికారంలో వున్నప్పుడు చెలరేగిపోయింది. పోరాటం చేసిన ప్రతిపక్షాల మీద లెక్కలేని తప్పుడు కేసులు పెట్టి, కొట్టి, హింసించి పైశాచిక ఆనందం పొంది, విచ్చలవిడి దోపిడీతో పాతాళంలో పడిపోయింది. అక్కడి నుండి లేచే క్రమంలో బూతుల & ఫేక్ సోషల్మీడియా అకౌంట్లు దానికి గడ్డిపరకల లాంటిది. వాటిని పట్టుకొంటే అవి ఊడి వెళ్లి ఊచల మధ్య పడతాయి. అంతిమంగా కిరణ్ అరెస్ట్ అనేది వైకాపాకు లాంగ్ టర్మ్ లో గుదిబండ అవుతుంది.

అదే ఇప్పుడు వైకాపా సోషల్మీడియాలో కార్యకర్తలను వణికిస్తోంది. ఏ పార్టీ అయినా.. సమాజం అయినా.. సోషల్మీడియాను మంచికి వాడడం మంచిది. చెడుకు వాడితే చేటుగాలమే. చెడు సులువుగా వేగంగా వెళుతుంది. మంచి నిదానంగా పదే పదే చెబితేనే వెళుతుంది. మంచే చివరికి మనిషి మనసు మార్చి నిలబడుతుంది. సోషల్మీడియాతో ఏమార్చే కాలం పోయింది. జరిగిన నష్టం తలచుకొని జనం చాలా జాగ్రత్తగా వున్నారు. ఎందుకంటే ఆ గుణపాఠం నేర్పిన మహానుభావుడు జగనే.

Related posts

పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షడిగా విశ్వేశ్వరరావు

Satyam NEWS

పి వి వాణికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి

Satyam NEWS

హ్యాపీ బర్త్ డే: కొడుకు పుట్టిన రోజున పేదల్ని ఆదుకున్న తండ్రి

Satyam NEWS
error: Content is protected !!