యువగళం..ఈ పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ చరిత్ర. యువగళం పాదయాత్రతో లోకేష్ పొలిటికల్ గేమ్‌చేంజర్‌గా నిలిచారు. లోకేష్ మొదలుపెట్టిన యువగళం యాత్ర ఇప్పుడు రెండేళ్లు పూర్తి చేసుకుంది. జగన్ రాక్షసపాలన అంతమే లక్ష్యంగా 2023 జనవరి 27న యువగళం పాదయాత్రను చిత్తూరు జిల్లా కుప్పం వరదరాజస్వామి ఆలయం నుంచి లోకేష్ మొదలుపెట్టారు.
ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఈ పాదయాత్ర సాగింది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు 97 నియోజకవర్గాలు, రెండు వేలకుపైగా గ్రామాల మీదుగా దాదాపు 226 రోజుల పాటు 3 వేల 132 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేశారు. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన నాడు ఎన్నో విమర్శలు, దాడులు, అవమానాలు ఎదుర్కొన్నాడు. ఏసీ రూములకు అలవాటుపడిన లోకేష్ పాదయాత్ర చేయగలడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యర్థులు సైతం పాదయాత్ర చేయలేక లోకేష్ మధ్యలోనే కాడి ఎత్తేస్తాడు అని విమర్శలు చేశారు.
అదే సమయంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని యువగళాన్ని అణచివేసేందుకు జగన్ చేయని ప్రయత్నం లేదు. పోలీసు వ్యవస్థ, సోషల్‌మీడియా వ్యవస్థను పెట్టుకుని యువగళం పాదయాత్రను టార్గెట్ చేశారు. లోకేష్ పాదయాత్రకు జనం లేరని, ఆయన పాదయాత్రను ఎవరూ లెక్క చేయడం లేదంటూ ట్రోల్ చేశారు. లోకేష్ మాట్లాడుతున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసేవారు. మైకులు లాక్కెళ్లే వారు. పాదయాత్రను ఆపేందుకు ఎన్ని చేయాలో అన్ని కుట్రలు చేశారు.
యువగళం సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సమయంలోనే లోకేష్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చంద్రబాబును అరెస్టు చేసింది జగన్ ప్రభుత్వం. కర్నూలు పర్యటనలో ఉండగా చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేసింది. దీంతో నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఐతే ఇది ఓ రకంగా తెలుగుదేశం పార్టీకి ప్లస్‌గా మారింది. చంద్రబాబు అరెస్టయిన సమయంలో లోకేష్ ధైర్యంగా నిలబడ్డ తీరుతో ఆయనకు ప్రజల్లో ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.
జగన్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన వెనక్కి తగ్గలేదు లోకేష్. ఎండనక, వాననక తన పాదయాత్ర కొనసాగించారు. మైక్ ఉన్నా, లేకున్నా బిగ్గరగా ప్రసంగాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం రగిలించారు. పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపారు. ధైర్యంగా ఉండండి భవిష్యత్తు మనదే అంటూ నేతల్లో భరోసా కల్పించారు. పాదయాత్రతో లోకేష్ పర్ఫెక్ట్ పొలిటికల్ లీడర్‌గా నిరూపించుకున్నాడు. తన సామర్థ్యం మీద అప్పటి వరకు ఉన్న అనుమానాలకు చెక్ పెట్టాడు.
ఏ బెరుకు లేకుండా జగన్ పాలనను ఛాలెంజ్ చేసి వైసీపీపై పోరాటంలో ముందుండి నడిపించాడు. నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉన్నాడు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం అఖండ విజయాన్ని సాధించిందంటే అందుకు కారణం యువగళం పాదయాత్రే. ఇది ఏ టీడీపీ కార్యకర్తను అడిగినా చెప్తాడు. లోకేష్ పాదయాత్ర ప్రభావం ఎంతలా ఉందంటే 144 స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో తిరుగులేని మెజార్టీతో విజయం సాధించింది. సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ సాధించింది.
జగన్ తన కంచుకోటగా భావించిన రాయలసీమలోనూ వైసీపీని మట్టి కరిపించారు లోకేష్. 2019లో రాయలసీమలోని 52 స్థానాలకు 49 స్థానాలు గెలుచుకున్న వైసీపీ..2024 ఎన్నికలకు వచ్చే సరికి 7 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అలా లోకేష్ యువగళం పాదయాత్ర తెలుగుదేశం చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది.