శ్రీ క్రోధినామ సంవత్సరంలో పితృయోగసాధన నేటి నుంచీ మొదలు కానుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి దక్షిణాయనం అనే పితృయానం మొదలు కానుంది. దీనికి అనువుగా మహావిష్ణువు బుధవారం ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమించనున్నాడు. అప్పటి నుంచీ గృహస్థులు చాతుర్మాస్యదీక్షను ప్రారంభిస్తారు.
గృహస్థాశ్రమ చాతుర్మాస్యం సాధన గురించి గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు ప్రబోధించారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచీ రెండు నెలలు అంటే శ్రావణం, భాద్రపదమాస ఏకాదశి వరకూ చాతుర్మాస్య వ్రతాన్ని సంసారులు చేస్తారు. ఈ సమయంలో స్థిరంగా తమ సాధనలు చేస్తారు. తమ గురువుల నుంచీ ఉపదేశాలు పొంది మంత్ర సాధన, యంత్రసాధన చేస్తారు. చాలా మంది జపసాధన చేస్తారు. గోసేవా సాధన చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ రెండు నెలలు మనోభీష్టాలు నెరవేరాలని ప్రతిరోజూ ఆవుకు గ్రాసం వేసి నమస్కరించుకొని గోస్తోత్రాలు, పితృదేవతాస్తోత్రాలు చదువుకోవాలి.
పరమేశ్వరుడు, గౌరీదేవి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, గంగాదేవి, కుమారస్వామి, ఆదిత్యులు, రుద్రులు, వసువులు, నాగులు యక్షులు కిన్నరులు, యక్ష, రాక్షసులు, గంధర్వ, కింపురుష, సనత్కుమారాది చిరంజీవుల జీవదేవతగా ఆవును ఆరాధిస్తారు. ఇప్పుడు మొదలయ్యే సాధన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే జనవరి వరకూ కొనసాగుతుంది. నేటి నుంచీ సేకరించే ఆవుపిడకలతో కొత్తబియ్యాలతో పొంగలి చేసుకొని పితరులకు నైవేద్యం పెట్టడంతో పితృయానసాధన ముగుస్తుంది.
మధ్యలో భాద్రపద కృష్ణపక్షం నుంచీ పితృపక్షాలు వస్తాయి. దీని తరువాత యంత్రమంత్రతంత్రసాధనకు ఆశ్వీయుజమాసం నవరాత్రులు శరన్నవరాత్రులుగా వస్తాయి. ఆ తరువాత నక్తములు కార్తీకంలో వస్తాయి. కృత్తికావాసునికి కార్తీకమాస పౌర్ణమి నాటి ఉత్సవాలతో నెలరోజుల కఠిన సాధన జరుగుతుంది.
ఇవన్నీ ఇలా ఉండగా యతీశ్వర చాతుర్మాస్యం పౌర్ణమి నాడు పరమేశ్వరుడు హిమాలయాల్లో శయనవాసుడు అవడంతో మొదలు అవుతాయి. సరిగ్గా ఇదే రోజున వ్యాసభగవానుని, జగద్గురువులు శంకరాచార్యుల వారిని పూజించి చాతుర్మాస్య దీక్షను యతీశ్వరులు స్వీకరించి తమ శిష్యపరివారానికి రెండు నెలల దీక్షను వివిధ ప్రవచనాల ద్వారా బోధిస్తారు. శ్రావణభాద్రపదాల వర్షాకాలంలో తమ యాత్రలు అన్నీ వాయిదా వేసుకొని స్థిరనివాసంగా ఒకే చోట ఉండి జగత్కళ్యాణ సాధనలు చేస్తారు.
అనంతసాహితి ఈ సందర్భంగా విశేషకార్యక్రమాలు చేయనుంది. ముందుగా గురుపౌర్ణమినాడు వ్యాసభగవానునిలో లీనమైన గురుదేవుల సిద్ధి ఉత్సవాన్ని చేసుకోనుంది. అప్పటి నుంచీ చాతుర్మాస్య దీక్షను కొనసాగిస్తుంది. అందుచేత రేపటి నుంచీ చిరకాల వాంఛలు తీరని వారు గోదేవతా పితృదేవతా యోగసాధనలో భాగంగా ఆషాఢ ఏకాదశి నుంచీ, భాద్రపద శుద్ధ ఏకాదశి వరకూ చాతుర్మాస్య వ్రతదీక్షను చేపట్టవచ్చు. ఇందులో భాగంగా తమకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవులకు గ్రాస సమర్పణ చేసుకోవాలి. ఆవును జీవదేవతగాసమస్త దేవతల నిలయంగా భావించాలి.
మనసులోని కోరికలు తీరడానికి గురుదేవులు మహాపురాణాల నుంచీ సేకరించిన గోస్తోత్రాలు, పితృదేవతా స్తోత్రాలు చదువుకొనడమో లేదా వినడమో చేయాలి.
ప్రత్యక్షంగా గోసేవ చేసే అవకాశం లేని వారు అనంతసాహితి గోసేవా నిధి ద్వారా పాల్గొని గోసేవాసాధన చేసుకోవచ్చు.
స్తోత్రాలు లేని వారు 7842224469కి వాట్సప్ చేసి పొందవచ్చు. ఈ సేవల్లో పాల్గొనాలనుకునే వారు తమ గోత్రనామాలు, పెద్దల గోత్రనామాలు మాకు 7842224469కి వాట్సప్ చేయవచ్చు. తమ శక్తి కొలదీ ఈ కార్యక్రమానికి విరాళం పంపవచ్చు. ఆసక్తి కలవారు భారత ప్రభుత్వ భీం ఫోన్ ఆప్, మీ బ్యాంకు ఆప్ ల ద్వారా క్రింది వాటిని ఉపయోగించి తమకు తోచిన దానం పంపి ఈ యాత్రా ఫలాల్లో పాల్గొనవచ్చు.
for paytm, Phonepay, googlepay, Gpay 9247821505, 7842224469 ముఖ్యగమనిక: మీరు దానమును పంపిన తరువాత 7842224469 వాట్సప్ ద్వారా మీ గోత్రనామాలు తప్పని సరిగా పంపండి.