39.2 C
Hyderabad
March 29, 2024 15: 09 PM
Slider ప్రత్యేకం

జగన్‌ రెడ్డి కోటరీలో చిచ్చు పెట్టిన లోకేష్‌

#Nara Lokesh

వైసీపీలో కొత్త టెన్షన్‌…!!

యువనేత, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌… యువగళం పాదయాత్రతో రాజకీయంగా రాటు తేలుతున్నారు.. ఆయన చేస్తున్న వ్యూహాత్మక వ్యాఖ్యలు ప్రత్యర్ధి పార్టీలో చిచ్చు రేపుతున్నాయి.. ముఖ్యంగా అధికార వైసీపీలో ప్రకపంనలు రేపుతున్నాయి.. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పాదయాత్రం సందర్బంగా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు వైసీపీన అధిష్టానాన్ని డైలమాలో పడేశాయి.. ఆ పార్టీలో చిచ్చుపెడుతున్నాయి.

వైసీపీ అంటే ఆ నలుగురు రెడ్డి నేతలు మాత్రమే అని మరెవరికీ చోటు లేదని వ్యాఖ్యానించారు లోకేష్‌.. ఆ నలుగురు రెడ్లలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేరుని లోకేష్‌ ప్రస్తావించారు.. ఆ నలుగురు రెడ్డి నేతలలో జగన్‌ కోటరీలో కీలక నేతగా, A2గా ముద్రపడిన విజయసాయి రెడ్డి పేరుని సంబోధించలేదు… లోకేష్‌ ప్రకటించిన ఆ నలుగురు రెడ్ల లిస్టులో విజయసాయి రెడ్డి పేరు లేకపోవడం వైసీపీ వర్గాలతోపాటు ఏపీ రాజకీయాలలోనూ చర్చనీయాంశంగా మారుతోంది.

జగన్‌ రెడ్డి పాలనలో రెడ్లూ బాధితులే అని ఆయన చేసిన ప్రకటన వైసీపీని కుదిపేస్తోంది. ఎంతో వ్యూహాత్మకంగానే లోకేష్‌.. ఆ నలుగురు రెడ్లలో విజయసాయి రెడ్డిని ప్రస్తావించలేదనే చర్చ మొదలయింది.. విజయసాయి రెడ్డి గత కొంతకాలంగా వైసీపీలో అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు.. టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు, లోకేష్‌పైనా ఆయన ట్వీట్‌ వార్‌ చేయడం లేదు.. సోషల్‌ మీడియాలో వీరిపై నో కామెంట్స్‌.. అంతా సైలెన్స్‌గా సాగుతోంది వ్యవహారం.. గతంలో పార్టీలో నెంబర్‌ 2 వ్యవహరించి ఎంతో యాక్టివ్‌గా వ్యవహరించిన విజయసాయి రెడ్డిని జగన్‌ దూరం పెట్టారనే ప్రచారం జరుగుతోంది..

వైసీపీతోపాటు జగన్‌ టీమ్‌లో కీలక నేతగా విజయసాయి రెడ్డి బాధ్యతలతోపాటు స్థానాన్నిసైతం సకలశాఖా మంత్రి సజ్జలకు దక్కించుకున్నారని సొంత పార్టీ వర్గాలలోనే టాక్‌ ఉంది.. గత కొంతకాలంగా తాడేపల్లి ప్యాలెస్‌లో సైతం విజయసాయి రెడ్డి అడుగుపెట్టలేదంటే ఆయనకు అక్కడ ఎంత అవమానం జరిగిందో అర్ధం చేసుకోవచ్చని గుర్తు చేస్తున్నారు రాజకీయ పండితులు.. ఏడాదిన్నర క్రితం ఉత్తరాంధ్ర పర్యటనకి వెళుతున్న జగన్‌ హెలికాప్టర్‌ ఎక్కబోతున్న విజయసాయి రెడ్డిని సడెన్‌ గా దించేసి అవమానించారని, అప్పటినుండి ఆయన వైసీపీ హైకమాండ్‌పై గుర్రుగా ఉన్నారని సమాచారం.. అప్పటినుండి పెరిగిన గ్యాప్‌, ఇప్పటికీ తగ్గలేదని, అందుకే, ఎంతో స్ట్రాటజిక్‌ గా లోకేష్‌.. జగన్‌ క్లోజ్‌ టీమ్‌లో విజయసాయి రెడ్డి పేరుని దూరం పెట్టారనే చర్చ సాగుతోంది.

మరోవైపు, విజయసాయి రెడ్డితో లోకేష్‌కి అత్యంత సన్నిహిత బంధుత్వం ఉంది.. దివంగత సినీ నటుడు, నందమూరి నట వారసుడు తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి తల్లి సోదరి భర్త విజయసాయి రెడ్డి.. తారకరత్న మరణంతో ఆయన కుటుంబ బరువు బాధ్యతలు కూడా లోకేష్‌ మీదే పడింది.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన అభయహస్తం ఇచ్చారు. తారకరత్న హాస్పిటల్‌లో చికిత్స పొందిన సమయంలో, చనిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి… ఇటు నారా, అటు నందమూరి ఫ్యామిలీతో ఎంతో సన్నిహితంగా మెలిగారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో ఏకంగా గంటపాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు..

ఈ సమయంలో విజయసాయి రెడ్డి వైసీపీకి సంబంధించి అనేక కీలక అంశాలు ప్రస్తావించారని రాజకీయవర్గాలలో ప్రచారం జరిగింది.. ఇటు, ఇటీవల ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో తన అల్లుడు సోదరుడు శరత్‌ చంద్రారెడ్డిని అప్రూవర్‌గా మార్చడంలో జగన్‌ పాత్ర ఉందని చర్చ సాగుతోంది.. ఇది విజయసాయిరెడ్డి ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా, జగన్‌ రాజకీయ అవసరాల మేరకు అంగీకరించాల్సి వచ్చిందనే టాక్‌ ఉంది.. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎంతో వ్యూహాత్మకంగా లోకేష్‌, జగన్‌ రెడ్డి కోటరీలో విజయసాయి రెడ్డి పేరుని ప్రస్తావించలేదని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు..జగన్‌ తన సొంత సామాజిక వర్గం రెడ్లకు కూడా అన్యాయం చేశారని గుర్తు చేశారు టీడీపీ యువనేత.

అంతేకాదు, రెడ్డి సామాజికవర్గం నేతలందరినీ ఒకే గాటన కట్టడం కూడా తన అభిమతం కాదని చెప్పడం లోకేష్‌ ఎత్తుగడగా భావిస్తున్నారు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గాన్ని లైట్‌ తీసుకున్నారని, వారికి కాంట్రాక్టులు ఇవ్వలేదని, ఇచ్చినా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేయడం ఇందులో భాగమే అని చెబుతున్నారు ఎనలిస్టులు.. జగన్‌ కష్టాలలో ఉన్న సమయంలో ఎంతో సన్నిహితంగా మెలిగిన విజయసాయి రెడ్డినే దూరం పెట్టారని, ఇక మీరెంత అనే సంకేతాలు రెడ్డి సామాజిక వర్గం నేతలకు పంపడం లోకేష్‌ వ్యూహంగా భావిస్తున్నారు టీడీపీ నేతలు. ఇన్ని కోణాలలో ఆలోచించిన లోకేష్‌.. జగన్‌.. రెడ్డి కోటరీని తెరముందుకు తెచ్చారని, అందులోనూ రెడ్డి సామాజికవర్గం నేతలతో ప్రత్యేక భేటీ సందర్భంగా రాయలసీమ డిక్లరేషన్‌ ప్రకటించే సందర్భంలో ఈ ప్రస్తావన తేవడం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారుతోంది.

లోకేష్‌ ప్రకటన రెడ్డి సామాజికవర్గం నేతలని బలంగా తాకిందని చెబుతున్నారు రాజకీయ పండితులు.. పార్టీ ఆవిర్భావం నుండి 2019వరకు రెడ్డి సామాజిక వర్గం నేతలలో ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారో లోకేష్‌ అంకెలతో సహా బయటపెట్టిన తీరుని ప్రశంసిస్తున్నారు వైసీపీలోని కొందరు సీనియర్‌ నేతలు.. వైసీపీ హై కమాండ్‌ రెడ్డి కోటరీపై లోకేష్‌ కామెంట్స్‌, ఏపీ రాజకీయాలలో పెనుదుమారం రేపేలా కనిపిస్తున్నాయి… మరి, టీడీపీ యువనేత వ్యూహానికి కౌంటర్‌గా వైసీపీ ఎలాంటి ఎత్తుగడని వేస్తుందో చూడాలి.

Related posts

బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌ ఆస్తుల వేలానికి నిర్ణయం

Sub Editor

రాజధాని సంగతి తర్వాత సంస్కారం నేర్చుకోండి

Satyam NEWS

నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో విషాదం

Satyam NEWS

Leave a Comment